తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..?

Divya
మనిషి ఆరోగ్యం ఎప్పటికీ ఒక్కటే లాగే ఉంటుంది అని చెప్పలేము..చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి.. అలాంటప్పుడు ఇంటి చిట్కాలతోనే వాటిని మనం నే చేసుకుంటే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా రాదు అని అంటున్నారు నిపుణులు. ఇకపోతే నోటి దుర్వాసన, దగ్గు , నోటిలో పుండ్లు , గొంతు నొప్పి ఇలా సమస్య ఏదైనా సరే ఇంటినుంచే పరిష్కారం వెతుక్కోవచ్చు. కొద్ది పాటి జాగ్రత్తలతో మరి కొన్ని సూచనలు పాటిస్తే, తప్పకుండా మాయమైపోతాయి..

ఇక గొంతులో చికాకు, నోటి పుండ్లు, నోరు మంట , పెదాల పగుళ్లు, దగ్గు , నోటి దుర్వాసన వంటివి పొడిగా ఉండే కొన్ని  నోటి లక్షణాలు మాత్రమే అని ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియో ఫేషియల్ రీసెర్చ్ చేసి రిపోర్ట్ ద్వారా తెలపడమైనది.. ఇలాంటి సమస్యలతో  గొంతు నొప్పి ఎక్కువ అయినప్పుడు..కొన్ని చిట్కాలు పాటించి కూడా  విముక్తి పొందవచ్చు. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
ముందుగా వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి,  రోజుకు రెండు నుండి మూడు సార్లు నోట్లో వేసుకొని పుక్కిలించడం చేయాలి.. ఇలా చేయడం వల్ల గొంతు లో బాగా పేరుకుపోయిన జిగట వంటి శ్లేష్మాన్ని ఈ నీరు వల్ల పొర  పలుచబడుతుంది.
ఇక మెంతులతో డికాక్షన్ చేసుకొని రెండు మూడు సార్లైనా పుక్కిలించడం వల్ల గొంతు పొడిబారిపోవడం, పొడి దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను తొలగించవచ్చు..
పర్యావరణంలో ఉండే దుమ్ము ,vధూళి, పొల్యూషన్ కారణంగా గొంతులో చికాకు పుట్టే అవకాశం ఉంది.  అయితే ఇలాంటి సమస్యలకు శ్రేష్టమైన పరిష్కారం కేవలం హెర్బల్ టీ అని చెప్పవచ్చు.. ఈ టీ కోసం మీరు పచ్చ ఏలకులు, లవంగాలు  వంటి కొన్ని మసాలా దినుసులతో టీ చేసుకొని తాగడం వల్ల యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేసి గొంతు నొప్పిని దూరం చేస్తాయి.

యాంటీ ఫంగల్ తోపాటు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న నెయ్యిలో కొద్దిగా మిరియాల పొడి వేసి తినడం వల్ల గొంతు తడి గా మారి , గొంతు నొప్పి నుండి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: