డెంగీ వ్యాధికి ఇలా చెక్ పెట్టండి !!

Veldandi Saikiran
వర్షాకాలం ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో విష జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా... ప్రజలు ప్రాణ భయంతో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెంగీ  జ్వరాలు... రెండు తెలుగు రాష్ట్రాల ను కుదిపేస్తున్నాయి. వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో దోమలు పెరుగుతున్నాయి. తద్వారా డెంగీ  జ్వరాల కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ డెంగీ జ్వరాన్ని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని అరికట్టవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం.

డెంగీ జ్వరం నేపథ్యం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే...
డెంగీ జ్వరం వచ్చిన వారు.. తగ్గిన తర్వాత కూడా కనీసం వారం రోజుల పాటు మాంసాహార పదార్ధాలను తీసుకోకపోవడమే మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మనకు తొందరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా పండ్ల రసాలు తాగితే డెంగీ వ్యాధి సోకిన  వారికి చాలా మంచిది.
అలాగే డెంగీ జ్వరం సోకినవారు కచ్చితంగా బొప్పాయి పండ్లు లేదా యొక్క ఆకుల రసాన్ని తీసుకుంటే త్వరగా కోలుకో వచ్చును. బొప్పాయి ఆకుల రసాన్ని మనం తీసుకోవడం కారణంగా రక్తంలో ప్లేట్ లెట్ సంఖ్య పెరుగుతుంది. తద్వారా డెంగీ జ్వరం తొందరగా తగ్గిపోతుంది. బొప్పాయి పండ్ల తోపాటు టీవీలు మరియు దానిమ్మ పండ్లు తింటే... డెంగీ సోకిన వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
డెంగీ జ్వరం సోకిన వారికి మరోసారి దోమలు కుట్టకుండా చూసుకుంటే మంచిది. దోమలకు సంబంధించిన తెరలను ఇతర పరికరాల ద్వారా దోమలను అరికట్టాలి. ముఖ్యంగా ఇంట్లో మరియు మన ఇంటి బయట పరిసరాలలో చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడా కూడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
ఈ డెంగీ దోమలు.. ఎక్కువగా మధ్యాహ్నం పూట నే కుడతాయి అని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది.
ముఖ్యంగా ఈ దోమలు కుట్టకుండా ఉండేందుకు కురచ దుస్తులు... వేసుకోకుండా పొడవైన దుస్తులు ధరిస్తే చాలా మంచిది.
డెంగీ జ్వరం అంటువ్యాధి కాకపోయినా... ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే డెంగ్యూ సోకిన వ్యక్తిని పుట్టిన దోమ... ఇంట్లో ఉండే ఇతర కుటుంబ సభ్యులకు కుట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ డెంగీ విషయంలో చిన్నారులు మరియు వృద్ధులను  చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.  ఈ వ్యాధి సోకిన ముందే వారికి రోగనిరోధక శక్తి పెంచే లా ఆహారాన్ని అందించాలి.
డెంగీ జ్వరం వస్తే భయపడకుండా... కొన్ని  జాగ్రత్తలు కచ్చితంగా పాటిస్తే ఈ వ్యాధిని సులభంగా అరికట్టవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: