ఇన్ఫెక్షన్స్ నుండి .. న్యూజీలాండ్ సేఫ్ ..

Chandrasekhar Reddy
ఇటీవల దాపురించిన కరోనా కావచ్చు లేదా అసలు అనారోగ్యం వలన కావచ్చు ఈ మధ్య కాలంలో యాంటీ బయోటిక్ ల వాడకం బాగా పెరిగిపోయింది. దీనితో వీటికి కూడా అలవాటు చేసుకుని కొత్త బాక్టీరియా లు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఎక్కువ వాడితే దాని ఫలితం ఇలాగె ఉంటుందనేది మరోసారి ఈ సందర్భం గుర్తుచేస్తుంది. ఎప్పటి నుండి మానవుడిని రక్షిస్తూ వస్తున్న ఈ యాంటీబాడీలు నేడు కొత్తగా వస్తున్న ఎన్నో రకాల బాక్టీరియాలతో పోరాడలేకపోతున్నాయి. దీనికి కారణం విపరీతంగా యాంటిబయోటిక్ లను వాడిపారేస్తున్నారు. కేవలం తాత్కాలికంగా ఫలితం బాగుందని వీటివాడకం పెంచేస్తున్నారు. ఇది వారి భవిష్యత్తులో పెనుమార్పులు తెస్తుందని వారికి తెలియటం లేదు.
గతంలో ఈ యాంటిబయోటిక్ లు ఉన్నాయి కాబట్టే అనేక పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు కూడా సులువుగా చేయగలిగారు. కానీ, ఇప్పటి పరిస్థితికి వీటి అలసత్వం వలన చిన్న శస్త్రచికిత్స చేయాలన్నా వైద్యులు ఆలోచించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి కరోనా సమయంలో మరీ ఎక్కువ అయ్యింది. ప్రతిదానికి యాంటీబయాటిక్ వేసుకోవడం ప్రజలలో అలవాటుగా మారిపోయింది. ఈ అతి వాడకం భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుందని నిపుణులు చెపుతున్నారు. ఏదైనా అవసరం మేరకు అదికూడా వైద్యుల పరివేక్షణలో మాత్రమే ఇటువంటివి వాడటం ప్రజలు అలవర్చుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు. అప్పుడే యాంటీబాడీలు కూడా ఎటువంటి బాక్టీరియాతో అయినా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాయని తెలిపారు.
తాజాగా న్యూజీలాండ్ లో తమ దేశంలోనే దొరికే ఒక ప్రత్యేకమైన శిలింద్రం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా మరింత శక్తివంతమైన యాంటీబయోటిక్ ఔషదాల తయారీకి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందని వారు తెలిపారు. ఇలాంటివి ఉంటేనే శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్ వంటి వాటికి చాలా సులభంగా వైద్యం చేయవచ్చు. ప్రపంచంలో 2024 నాటికి యాంటీబయోటిక్ లను తట్టుకొని మరి ఇన్ఫెక్షన్స్ వస్తాయని, అంటే వీటిని వ్యాపించే సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోతాయని వారు అంటున్నారు. ఇదే జరిగితే కనీసం సాధారణ శస్త్రచికిత్స కూడా చేయలేని స్థితి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: