యోని సమస్యలను తీర్చే సరికొత్త చిట్కా..?

Divya

ఆడవాళ్లు.. తమ శరీర భాగాలలో అతి ముఖ్యమైన అవయం  యోని..ఇక ఇటీవల కాలంలో చాలామంది మహిళలు ఎక్కువగా యోనిలో సమస్య వస్తోందని బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఆ పరిస్థితులలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటారు. ముఖ్యంగా ప్రైవేటు భాగాలలో.. వాసన రావడం వల్ల అనారోగ్య బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మనం ఈ విధంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
యోని భాగంలో  దుర్వాసన రావడం వల్ల మహిళలు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా,వారి  ఆత్మవిశ్వాసానికి ఒక సవాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యం పై ఎక్కువగా దృష్టి పెట్టనివారు.. ఇటువంటి వాసనలను ఎక్కువగా పట్టించుకోకుండా ఉండడం వల్ల, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. మహిళలలో వచ్చే  యోని దుర్వాసన నుండి  విముక్తి కలిగించడం కోసం ఇటువంటి చేస్తే సరి.
1). ముఖ్యంగా ఆడవారు యోనిని, ప్రతి రోజు వేడి నీటితో శుభ్రం చేసుకోవడం చాలా మంచిదట. అందుకే అందులో ఉండేటువంటి క్రిములు చనిపోవడం వల్ల వాసన రాకుండా వుంటుంది.
2). ఇక  జామకాయ ఆకులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ జామాకు తో యోని వాసనను కూడా నివారించవచ్చుట. అది ఎలానో చూద్దాం.
3) జామకాయ ఆకులను కొన్నిటిని తీసుకొని, కొద్దిగా నీరు పోసి ఒక స్టవ్ మీద  బాగా ఉడికించిన తరువాత , ఆ నీటిని గోరువెచ్చగా చేసిన తర్వాత యోని ని శుభ్రం చేసుకోవడం వల్ల ఆ ప్రాంతం వాసన రాకుండా ఉంటుంది.
4). ఇక జామాకు తో టీ చేసుకొని వారంలో ఒకసారి తాగడం వల్ల, యోని స్రావం నుంచి వాసన, యోని ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా జామ కాయ ద్వారా కూడా ఇటువంటి వాటిని నివారించవచ్చు.
5). ప్రతి రోజు ఒక జామకాయ తినడం వల్ల యోని ఎంతో ఆరోగ్యంగా, శరీరం బలంగా ఉండడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా నాటీ జామా  కాయలు తినడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: