చపాతి తిన్నాడు కంటిచూపు కోల్పోయాడు..?

MOHAN BABU
 ప్రస్తుత సమాజంలో  మనం తినే తిండి  కూడా విషంగా మారే అవకాశం ఉంది. మన శరీరానికి  ఏది  ఎక్కువైనా  ప్రమాదమే. ఆహారం ఎక్కువ తిన్నా ప్రమాదమే. తినకున్నా ప్రమాదమే. ప్రస్తుత కాలంలో ఏ పంట పండించిన రసాయన ఎరువులు వాడకం లేకుండా పండించడం లేదు. ఎరువులు ఎక్కువగా వాడడం వలన మనం తినే ఆహారమే ముందుగానే కలుషితమవుతోంది. దీని ద్వారా  మనిషికి అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.  ఈ యొక్క బాలుడు  చపాతీ ఎక్కువగా తినడం వలన అతనికి ఈ ప్రమాదం  వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లా కేంద్రంలోని కోడ్ గ్రామంలో సందీప్ అనే బాలునికి ఒక వింత ఆరోగ్య సమస్య వచ్చింది. 
 రోజురోజుకు కంటి చూపు కూడా మందగించింది. చివరికి ఒకరోజు ఏకంగా ఆ బాలుడు  అపస్మారక స్థితిలోకికూడా వెళ్లి పోయాడు. సాధారణంగా మానవ శరీరంలో  షుగర్ లెవెల్  అనేది 100-150 వరకు ఉంటేనే  సాధారణంగా భావిస్తారు.

 అదే చిన్నపిల్లల్లో అయితే ఆహారం తిన్న తర్వాత  200 ఉన్న ప్రమాదం లేదని  వైద్యులు చెబుతుంటారు. కానీ మధ్యప్రదేశ్ చెందినటువంటి  ఈ యొక్క పన్నెండు సంవత్సరాల పిల్లాడికి  షుగర్ లెవెల్స్ ఏకంగా 1200 పెరిగాయి. దీంతో ఆ యొక్క బాలుడు అతడు కంటిచూపు కోల్పోయాడు. మరియు అతని శరీరంలోని అవయవాలు కూడా పనిచేయడం లేదు. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.. ఆ బాలుడు ఏం తిన్నాడు.. తెలుసుకొందాం.  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లా కేంద్రంలోని  కోడ్ అనే గ్రామానికి చెందిన  సందీప్ అనే బాలుడు 12 సంవత్సరాలు. ఆ యొక్క బాలుడికి కొన్ని రోజులుగా  కంటి చూపు మందగిస్తు వస్తున్నది. చివరికి ఒకరోజు  ఈ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీంతో అతని తండ్రి బన్వార్  ఆ పిల్లాడిని దగ్గరలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లాడు. దీంతో వైద్యులు పరిశీలించి. బాలుడికి  షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఇలా జరిగిందని వైద్యులు తెలియజేశారు. చేయడంలో కదలిక లేకపోయినా  గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది అని, శ్వాస తీసుకుంటున్నాడని ప్రాణహాని లేదని తెలిపారు. అయితే ఆ బాలుడికి  షుగర్ లెవెల్స్  ఇంత మొత్తంలో ఎందుకు వచ్చాయని డాక్టర్ల తండ్రిని ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం బయటపడినది.

 ఆ బాలుడు  రోజుకు 45 చపాతీలు తినేవాడిని, అందువల్ల ఆ బాలుడి తలలో చీము చేరుకుందని, దాని వల్ల అతని కంటి చూపు కోల్పోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ఆ బాలుడు తల నుంచి చీమును బయటకి తీశారు. అతని షుగర్ లెవల్స్ తగ్గించడానికి కోసం  ఇన్సులిన్ సూదులు ఎక్కువ మోతాదులో ఇచ్చారు. ఆ పిల్లాడు  డయాబెటిక్ రెటినోపతి అనే రోగంతో బాధ పడుతున్నాడని, కండ్లకు త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించడంతో ఐదు రోజుల్లోనే సర్జరీ విజయవంతంగా చేసేసారు. దీంతో ఆ పిల్లాడికి కంటిచూపు మళ్ళీ తిరిగి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: