100 రోగాలను నయం చేసే పుట్టగొడుగులు ..

Divya
మనకు భూమి మీద దొరికేటటువంటి కొన్ని విలువైన వాటిలో పుట్టగొడుగులు కూడా ఒకటి. ఇక ఈ వర్షాకాలంలో ఎక్కువగా పుట్టుకొస్తాయి భూములోనుంచి. అయితే ఈమధ్యనే వీటిని పెంచి మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే ఈ పుట్టగొడుగులు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే, వీటిని తినక మానరు. అయితే వీటి లాభాలను ఒకసారి తెలుసుకుందాం.
1). పుట్టగొడుగుల్లో ముఖ్యంగా డి విటమిన్ ఉంటుంది.
2). పుట్టగొడుగులు తినడం వల్ల ఎముకల వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు.
3). షుగర్ వ్యాధి ఉన్నవారు వీటిని తినడం వల్ల ఈ వ్యాధి నుంచి కొంచెం  ఉపశమనం కలుగుతుంది.
4). ఇక అంతే కాకుండా రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకునే అటువంటి శక్తి ఈ పుట్టగొడుగులు ఉంటుంది.
5). పుట్టగొడుగుల్లో సెల్ యూనియన్ అనే  యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల గుండెజబ్బుకు, క్యాన్సర్ వంటి వాటిని దగ్గరకు రానీయకుండా చూసుకుంటుంది.
6). ఇక పుట్టగొడుగుల్లో 90 శాతం నీరు మాత్రమే ఉంటుంది. సోడియం వంటి పదార్థం ఉండదు. పొటాషియం కూడ లభిస్తుంది. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం చేత, బరువు పెరుగుతామనే ఆలోచన ఉండదు.
7). రక్తపోటు సమస్య ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. వీటిని ఉడికించి తినడం వల్ల ఇవి 20 శాతం ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
8). సూర్యుడి నుంచి వెలువడే డి విటమిన్ మానవ శరీరం తీసుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇందులో నుంచి వెలువడే డి విటమిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ముప్పు ఉండదు.
9). ఇందులో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి, శరీర పుష్టికి, కండర పుష్టికి, ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఉండే కాపర్ ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకు, కండరాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఉంటుంది. అందువల్ల అవి బాగా పనిచేస్తాయి.
చివరిగా భూమిలో ఇవి రెండు రకాలుగా లభిస్తాయి.. అందులో ఒకటి కుక్క పుట్టగొడుగులు అని అంటారు. వీటిని తినకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: