పటిక బెల్లంతో కలిగే ప్రయోజనాలు ఇవే..

Divya
పూర్వం ప్రజలకు పటిక బెల్లం అంటే బాగా తెలుసు. కానీ ఇటీవల కాలంలో మనలో కొంతమందికి పటిక బెల్లం అంటే అసలు తెలియదు ఇవే కాకుండా కొన్ని కొన్ని విషయాలు తెలియక నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇక పటికబెల్లంతో ఎటువంటి ఉపయోగాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం.
1). పటిక బెల్లం, మంచిగంధం, కొంచెం తేనెను కలుపుకొని బాగా ఉంటలు చేసుకొని, కడిగిన బియ్యం నీటితో కలిపి తాగడం వల్ల రక్త విరేచనాలు తగ్గుతాయి.
2). గర్భిణీ స్త్రీలలో వచ్చే గర్భ వాతం, కడుపు నొప్పి పోవాలంటే పటిక బెల్లం, గసగసాలు అన్నింటినీ బాగా కలిపి నూరి,  అందులో కొంచెం వెన్న కలిపి ప్రతి రోజు కొంచెం తీసుకోవడం వలన ఇవన్నీ తగ్గుతాయి.
3). శరీరంపై ఎక్కువ దద్దుర్లు ఉన్నట్లయితే.. పటిక బెల్లం కొంచెం, పుదీనా ఆకు రసం తీసుకొని రెండు పూటలా తీసుకోవడం వల్ల దద్దుర్లు తగ్గుతాయి..

4). కామెర్ల వ్యాధి ఉన్నవారు.. సొరకాయని బాగా దంచి, రసం బయటకు తీసి, అందులోకి పటిక బెల్లం పొడిని వేసి కలుపుకొని తాగితే కామెర్లు తగ్గుతాయి.
5). కళ్ళు ఎర్రబడినప్పుడు పటిక బెల్లాన్ని , కొంచెం నీటిలో కరిగించి, ఆ నీరు ని కంటిలో వేసుకోవడం వల్ల అవి తగ్గుతాయి.
6). ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు నిమ్మపండు మీద కొంచెం పటిక బెల్లంని వేసుకొని , ఆ పండుని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే వాంతులు తగ్గుతాయి.
7). తేలు కుట్టినప్పుడు విషం తగ్గాలన్నా పటిక బెల్లాన్ని, గంధం చెక్క పై బాగా రుద్ది , ఆ నీటిని తేలు కుట్టిన చోట పూసి కొద్దిసేపు రుద్దినట్లయితే తగ్గుతుంది.
8). ఫైల్స్ తో ఇబ్బంది పడుతున్న వారు పటిక బెల్లం, తామర పువ్వు రేకులు కలిపి, ముద్దగా నూరి ఉదయం పూట మాత్రమే తినాలి. తద్వారా తగ్గుతాయి.అందుకే పటికబెల్లంను వీలైనంతగా తగిన మొత్తంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: