గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు..!

MOHAN BABU
గోంగూర అంటేనే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ గోంగూరలో అనేక విటమిన్లు ఉన్నాయని చెప్పవచ్చు. ఇది తినడం వలన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరంలో విటమిన్ సమతుల్యతను మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. గోంగూరను పచ్చడిగా చేసుకుంటే ఆ రుచే వేరు. కాబట్టి గోంగూర అంటే  ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దీనినీ విడిగానే కాకుండా, ఇతర కూరగాయలతో కలిపి వండుకున్నట్లయితే ఆ టేస్టే అదిరిపోతుంది. ఇన్ని కలిగినటువంటి గోంగూరలో ఎన్నో సుగుణాలు దాగి  ఉన్నాయి.
 అలాగే గోంగూరలో  ఏ, బీ 1, బీ 2, బీ 9, సీ విటమిన్లు విస్తారంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి గోంగూర తినడం అనేది ప్రతి ఒక్కరికి మేలు కలుగుతుంది. గోంగూర తింటే  శరీరం సమతుల్యంగా ఉండటానికి కాకుండా మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది అని చెప్పవచ్చు. హృద్రోగాలను అరికట్టే అటువంటి సోడియం, జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచే టువంటి పీచు పదార్థం కూడా  గోంగూరలో ఉంటాయి. పోషకాల వనరులైన 11 రకాల అమైనో యాసిడ్స్ కూడా ఇందులో దాగి ఉన్నాయి. ఈ గోంగూర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గోంగూరలో  ఐరన్ కూడా ఉంటుంది. దీంతోపాటుగా శరీర  ఉష్ణోగ్రతను  సమంగా ఉంచడంలోనూ దోహదపడుతుంది.
ఇందులో ఉండే క్యాల్షియం  ఎముకల దృఢత్వాన్ని కల్పిస్తుంది. రిబొప్లెవిన్ నోటిపూత లాంటి ఆరోగ్య సమస్యలను దగ్గరికి రానివ్వదు. దీనితో పాటుగా కాలేయాన్ని కూడా కాపాడుతుంది, రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, కళ్లకు కూడా మంచి మేలు చేస్తుంది, చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. దీంతోపాటుగా క్యాన్సర్ లాంటి రోగాలను కూడా రాకుండా అరికడుతుంది. పాలిచ్చే తల్లులు గోంగూర తిన్నట్లయితే పాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే జుట్టు సమస్యలను, మలబద్ధకం సమస్యలను కూడా గోంగూర నివారిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది భోజనం అన్ని రకాలుగా మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: