శరీరంలో కాల్షియం లోపిస్తే ఇన్ని అనర్థాలా?

MADDIBOINA AJAY KUMAR
మన శరీరంలో కాల్షియంకు ఉన్న అవసరం అంత ఇంత కాదు. అనేక ముఖ్యమైన విధులను నిర్వహించడానికి శరీరానికి కాల్షియం ఎంతో అవసరం. కాల్షియం ఎముకలు మరియు దంతాలలో నిల్వ చేయబడుతుంది. శరీరంలో  ఎముకల పెరుగుదల, దంతాలు గట్టిగా ఉండి, పెరుగుదలకు కాల్షియం ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగా మల, మూత్ర విసర్జన ద్వారా కాల్షియం శరీరము నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇలా జరగడానికి కారణం మనం తీసుకునే ఆహారమే.
ఒకవేళ శరీరంలో కాల్షియం లోపిస్తే విపరీతమైన బరువు పెరగడం, ఏ కొంచెం పనిచేసిన అలసిపోవడం, ఏ పని చేయలేక పోవడం, చలికి తట్టుకోలేక పోవడం, ప్రతి చిన్న పనికి ఎక్కువగ ఆందోళన పడటం, చలి కాలంలో కూడా తలచుట్టూ చెమటలు పట్టడం, కండరాల నొప్పులు, స్త్రీలలో రక్త హీనత వంటి బాధలు కాల్షియం లోపించుట వలన సంక్రమిస్తాయి. సూర్య రశ్మి ద్వారా శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. దీని ద్వారా విటమిన్ ‘డి’ తయారౌతుంది. అందువల్ల ప్రతిఒక్కరు ఎండలో కొంత సమయం గడపాలి. కాల్షియం లోపించినవారు ఎక్కువుగా పెద్ద ఉల్లి, ఆకుకూరలు, మునగ, చిక్కుడు, గ్రుడ్డులోని పచ్చ సొన ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
కనీసం వారానికి రెండు, మూడు సార్లు ఆకుకురాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఒక కప్పు మునగాకు రసము బాగా వేడి చేసి చల్లార్చి, పై పై నీరు వంచేసి మిగిలిన పదార్థంలో పాలుపోసి కలిపి ప్రతి రోజు సేవిస్తే మంచి టానిక్ లా పనిచేస్తుంది. ఉడికించిన కోడి గుడ్డుని ప్రతి రోజు తినడం వలన శరీరానికి కావలసిన కాల్షియం, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే కాల్షియం ఎక్కువైనా అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ముఖ్యంగా పొట్ట నొప్పి రావడం, వాంతులు అవ్వడం, కండరముల బలహీనత, మానసిక ఆందోళన వంటివి జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: