మునగచెట్టులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..?

MOHAN BABU
మునగ చెట్టు పేరు  వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సాంబార్  జుర్రుకునే మునక్కడల రుచే.. కానీ ఆఫ్రికన్ దేశాల్లో మాత్రం  మునగ చెట్టు అంటేనే  పోషకాల్ని ఇచ్చే కల్పవృక్షంగా భావిస్తారు. భూమ్మీద ఉన్నటువంటి సమస్త పోషకాహార లోపాన్ని, సకల రోగాలన్నీ  నివారించడానికి మునగ చెట్టుకు మించిన టువంటి  కాయలు లేవని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికన్ దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులకు పిల్లలకు  మందులతోపాటు, మునగాకు పొడిని కూడా ఇస్తారు. అందుకని మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిపోయి, పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయి అని చెప్పే ఆఫ్రికన్లు  ఎంతోమంది ఉన్నారు. ఆ నోటా ఈ నోటా ఇది మన వరకు వచ్చింది. పెరట్లో ఉండే మునగ చెట్టు వైద్యానికి పనికిరాదనట్లు నిన్న మొన్నటి వరకు మనం మునగ చెట్టును  పట్టించుకోలేదు. కనీసం దాని వైపు కూడా చూడలేదు. మనం సాంబారు చేసుకున్నప్పుడు మాత్రమే మునగ కాయలు తెచ్చుకొని అందులో వేసుకుంటాం. కానీ అమెరికాకు చెందినటువంటి "ద ట్రీస్ ఫర్ లైఫ్" స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులో అనువనువు ఔషధ  గుణాలున్నాయని ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది.
ప్రపంచ దేశాలకు కూడా ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాయి. ఐక్యరాజ్య సమితి కూడా మునగ  యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ చెట్లను పెంచడాన్ని ప్రోత్సహించింది. దీంతో మన అందరి దృష్టి కూడా ఈ చెట్టుపై  పడింది. న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్  ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సి గోపాలన్, డాక్టర్ కమల కృష్ణ స్వామి లు  మునగాకు యొక్క విశిష్టతను చెప్పారు.
**మునగాకులో ఏముంది**
 మనం బ్రతికి ఉంటే బలుసాకు అయినా తిని  బతకొచ్చు అనేది పాత నానుడి, బలుసాకు ఏమోగానీ కాస్త మునగాకు తింటే చాలు వందేళ్లు బతుకవచ్చు అన్నది కొత్త సామెత. 100 గ్రాములు గల మునగాకులో నారింజలో కన్నా 7 రెట్లు సి విటమిన్, క్యారెట్ లలో కన్నా నాలుగింతలు క్యాల్షియం, అరటి పండులో కన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలో కన్నా మూడురెట్లు ఐరన్, బాదంలో కన్నా మూడు రెట్లు విటమిన్ ఈ, పెరుగులో కన్నా రెండింతలు ప్రొటీన్లు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే మునగాకు పూర్తిగా పోషకాహార లోపం నివారిస్తుందని అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది విటమిన్-ఎ లోపం వల్ల అందులు అవుతున్నారు. ఈ లోపాన్ని నివారించాలంటే మునగాకు ఎంతో మంచి ఔషధం అని పోషక నిపుణులు తెలుపుతున్నారు. ఈ కారణంగానే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి ఆ కాయ ని రోజు తినేవాడట. కాబట్టి మునగకాయలు తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: