చేపలతో సంపూర్ణ ఆరోగ్యం సొంతం....

Purushottham Vinay
మనం తినే ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలలో చేపలు కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పాలి. చేపలు సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారం. చాలా మంది కూడా చెరువు చెప్పాల్ని ఎక్కువగా తింటారు.ఇక ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా చెరువుల్లో దొరికే చేపల్నే తింటారు. నిజానికి చెరువుల్లో దొరికే చేపలతో పాటు సముద్రపు చేపల్ని కూడా తినటం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇక చేపలు తినటం వలన బీపీ, కొవ్వు, షుగర్ వ్యాధులు రావు. ఒకవేళ ఈ వ్యాధులు వున్నా కాని చేపల్ని తింటే అవి కంట్రోల్ లో ఉంటాయి. చేపల్లో కొవ్వు అనేది తక్కువగా ఉంటుంది.అంతేగాక చేపలో బలానికి సరిపడే నాణ్యమైన ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. కనీసం వారానికి రెండుసార్లైనా చేపలను తింటే చాలా మంచిది.

చేపలు ఎక్కువగా తినటం వల్ల గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, డయాబెటిస్, బీపీ, మెదడు సంబంధింత వ్యాధుల నుంచీ బయటపడవచ్చు.ఇక తీర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ప్రజలు చేపల్ని రెగ్యులర్‌గా తింటున్నారు. అందువల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు.అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చేపల్ని తింటే... పుట్టే పిల్లలు ఎంతో ఆరోగ్యకరంగా అలాగే పుష్టిగా కూడా ఉంటారు.ఇక మనం చేపల్ని ఎలాగైనా తినవచ్చు.ఎన్నో రకాలుగా చేపలను వండుకోవచ్చు. ఇంకా రుచికరంగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఎంతో రుచికరంగా బేకింగ్ చేసుకొని కూడా చెప్పాల్ని తినవచ్చు. కేవలం చేపల రుచికే కాదండోయ్ వాటితో మనం ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా సమృద్ధిగా పొందవచ్చు. 

ఇక చేపల్లో మొత్తం 9 రకాల ఆరోగ్యకరమైన అమైనో యాసిడ్స్  ప్రోటీన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరంలో ప్రతీ కణానికీ అవసరమైన ప్రోటీన్స్. మన బాడీకి సరిపడా ప్రోటీన్స్ అందితేనే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే వాటితో మన శరీరంతో పాటూ మన రక్తం కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. అలాగే చేపలు తినటం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఇక చేపలు లభించని ప్రాంతాల్లో ప్రజలకు ప్రోటీన్స్ కొరత ఏర్పడుతోంది.చాలా మంది కూడా చేపల్ని తింటే ఎక్కువ కొవ్వు పడుతుందని అపోహ పడుతూ వుంటారు. కాని నిజం చెప్పాలంటే చేపల్లో ఉండేది మంచి ఆరోగ్యకరమైన కొవ్వు.ఆ కొవ్వు మన శరీరానికి ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. చేపల్లో ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫ్యాట్స్ అనేవి ఉంటాయి.అవి మన గుండెను హార్ట్ ఎటాక్స్ నుంచీ కాపాడతాయి.ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరంలో తయారవ్వవు. ఆ ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లాంటి వాటి ద్వారానే మనం పొందగలం. 

ఇక చాలా మందికి కూడా ఈరోజుల్లో కంటి చూపు సరిగ్గా ఉండదు.చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళు దాకా కూడా కంటి చూపు సమస్యతో బాధ పడుతూ వుంటారు. అలాంటి వారు చేప తల భాగం ఎక్కువగా తినటం వలన వారికి కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. ఇక చిన్న వయస్సు నుంచే పిల్లలకు చేపలను ఆహారంగా అలవాటు చెయ్యడం వలన వారికి భవిష్యత్తులో ఎలాంటి కంటి సమస్యలు రావు. ఇంకా చేపలు తినటం వలన వారికి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.ఇంకా చాలా మందికి కూడా చాలా చిన్న వయసు నుంచే జుట్టు తెల్లబడుతుంది. అలాగే కొంతమందికి చాలా చిన్న వయస్సులోనే మొహం ముదిరిపోతుంది. అందువల్ల వాళ్ళు చిన్న వయస్సులోనే ముసలి వాళ్ళ లాగా కనిపిస్తారు.చేపలని తినటం ఈ సమస్యలు అసలు రావు.చేపల్లో వుండే ఒమేగా-3 ఫ్యాట్స్ జుట్టు తెల్ల బడకుండా అలాగే ముఖం ముదిరిపోకుండా కాపాడతాయి.అలాగే చేపలు తినటం వలన ఎక్కువ కాలం బ్రతకవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: