ఈ చిట్కాలతో దగ్గు మాయం...

Purushottham Vinay
చాలా మందికి దగ్గు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ట్రై చేసిన ఎన్ని మందులు వాడినా తగ్గినట్లే తగ్గి మళ్ళీ మళ్ళీ ఎక్కువవుతుంది.ఒక వేళ మీకు దగ్గు ఎక్కువగా వస్తున్నా, చాతి వద్ద మంట లేదా భారంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. ఇప్పుడు మీకు చెప్పే చిట్కాలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమే. దగ్గుకు సరైన చికిత్స వైద్యుడి ద్వారానే పొందాలనే విషయాన్ని మరిచిపోవద్దు. ఇక దగ్గు తక్షణమే తగ్గడానికి ఈ చిట్కాలు తప్పక పాటించండి.

దగ్గు మరీ ఎక్కువగా ఉంటే మిరియాల కషాయం తాగండి లేదా అర చెంచా నల్ల మిరియాల పొడిని నెయ్యితో కలిపి కడుపు నిండుగా ఉన్నప్పుడు తినండి. దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడి, పిప్పాలి పొడిని కలిపి తాగినా దగ్గు తగ్గుతుంది. దానిమ్మలో ఉండే విటమిన్ ఎ , సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.వేడి వేడి మసాలా టీ తాగినా దగ్గు తగ్గుతుంది.తేనె, యష్టిమధురం పొడి, దాల్చిన చెక్క పొడి నీటిలో కలిపి ఉదయం సాయంత్రం తీసుకున్నా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటే రోజూ ఉదయాన్నే రెండు చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తాగండి. తిప్పతీగ రసం రోగనిరోధకశక్తిని పెంచుతుంది,వాత, పిత్త, కఫాల మధ్య సమన్వయం తెస్తుంది.

దగ్గు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రోజూ రెండు పూటల గ్లాసు పాలల్లో కాస్త అల్లం లేదు వెల్లులి వేసి మరిగించండి. ఆ తర్వాత పసుపు వేసి గోరువెచ్చగా తాగితే ఉపశమనం ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది. పసుపులో కుర్క్యుమిన్ అనే పదార్థం వైరస్,బ్యాక్టీరియా, వాపు వంటి లక్షణాలని తగ్గిస్తుంది. అల్లం, వెల్లుల్లి టాన్సిల్స్ ప్రాంతంలో దిబ్బడను తగ్గించి సహజ నొప్పి నివారుణుల్లా పనిచేస్తాయి.ఇక ఈ చిట్కాలు పాటిస్తే దగ్గు ఖచ్చితంగా మాయం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: