కళ్ళు మసక బారినట్టు ఉన్నాయా..? అయితే వీటిని తినాల్సిందే..

Divya

మనం ఈ ప్రపంచాన్ని చూడాలన్నా, ప్రకృతిని ఆస్వాదించాలన్నా, ఆఖరికి మనల్ని మనం చూసుకోవాలన్నా  తప్పకుండా కావాల్సింది కళ్లే కదా..! అలాంటి కళ్ళ సంరక్షణలో ఏదైనా లోపం జరిగితే , చివరికి చూపును  కోల్పోవాల్సి వస్తుంది.. మరీ ముఖ్యంగా చాలా మంది తరచుగా కళ్ళ సమస్యలతో  పోరాడుతున్నారు. కానీ ఈ సమస్యను చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు వున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందికి గురి కాకుండా ఉండాలి అంటే కొన్ని హోం రెమడీస్ ను పాటిస్తే సరిపోతుంది అని అంటున్నారు నిపుణులు.. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తీసుకుందాం..

1. ఎండు ద్రాక్ష, అత్తిపండ్లు :
ముఖ్యంగా ఎవరికైతే కళ్ళు మసకబారి నట్టు అనిపిస్తున్నాయో, అలాంటివాళ్లు నానబెట్టిన ఎండు ద్రాక్ష ,అత్తి పండ్లను తీసుకోవాలి. ఇందుకోసం రాత్రి రెండు అత్తిపండ్లను, 10 నుంచి 15 ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టాలి. ఇక వీటిని రోజు ఉదయం ఖాళీ కడుపుతో  తినడం మంచిది..
2. నానబెట్టిన బాదం పప్పులు:
నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల కంటి చూపుకు చాలా మంచిది. ఇక దీనికోసం మీరు చేయవలసిందల్లా, ప్రతిరోజు రాత్రి ఒక గుప్పెడు బాదం పప్పులను నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే వీటిని పొట్టుతో సహా తినాలి. ఇలా తినడం వల్ల కళ్ళ సమస్యలను తొలగించడమే కాకుండా బ్రెయిన్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది.
3. కళ్ళకు వ్యామాయం :
కళ్లు ఆరోగ్యంగా ఉండడానికి కళ్ల వ్యాయామం తప్పనిసరి. ఇది ఒత్తిడికి కూడా ఉపశమనం లా పనిచేస్తుంది .ఇక దీని కోసం రెండు చేతులను కలిపి రుద్ది, కళ్ళ మీద ఉంచాలి. ఇక  కొద్దిసేపటి తర్వాత చేతులు తీసి, నెమ్మదిగా కళ్లు తెరవాలి .ఇక అంతే కాకుండా ఐబాల్ ని కూడా ఎడమ నుంచి కుడికి, పైకి కిందకు తినవచ్చు..
4. బాదం ,సోంపు, చక్కెర మిశ్రమం:
బాదం ,సోంపు గింజలు ,చక్కెర వీటన్నింటిని మెత్తని పొడిలా చేసి , రాత్రి పడుకునే ముందు ఒక చెంచా పొడిని పాలల్లో కలిపి తాగాలి. ఇలా తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: