జ్వరం వచ్చినప్పుడు ఒక పూటైనా చపాతీ తినాలట..ఎందుకో తెలుసా..?

Divya
ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరు వారి ఆహార విషయంలో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటూ ఉంటారు . రాత్రిళ్ళు అన్నం మానేసి చపాతీలు తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే దీని వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే అన్నం మానేసి రాత్రులు చపాతీలు మాత్రమే తినాలని అనుకుంటే , మాత్రం అది చాలా ప్రమాదం. కాబట్టి మీరు ఒక వేళ చపాతీలను రాత్రులు తినాలి అనుకుంటే, చపాతి తిన్న తర్వాత ఒక చిన్న బౌల్ సైజులో పెరుగన్నం తింటే సరిపోతుంది..
ఇక ప్రతి రోజూ ఒక పూట చపాతీ తినడం వల్ల,  అనేక ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. అదేమిటంటే చపాతీ లో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. కాబట్టి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇక చపాతీల లో విటమిన్ బి, విటమిన్ ఈ తో పాటు కాపర్ ,జింక్ ,మాంగనీస్ ,అయోడిన్ ,సిలికాన్ ,పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంటే ఇవన్నీ కూడా మన రోజూ శరీరానికి కావలసిన పోషకాలను కొద్ది మోతాదులో భర్తీ చేస్తాయి.
ఇక అధిక  రక్తహీనతతో బాధపడే వారు ఈ సమస్య నుంచి విముక్తి పొందాలి అంటే , ప్రతి రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక అంతే కాకుండా చపాతీ లో ఉండే అధిక ఐరన్ స్థాయి, శరీరంలోని హీమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్దీకరిస్తుంది .తెల్ల రక్త కణాలు పెరగడం లోను ఈ ఆహారం తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా జ్వరంగా అనిపించినప్పుడు చపాతీని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి . ఇందులోని పోషకాలు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. జ్వరాన్ని తగ్గిస్తాయి.. ఇంకా చెప్పాలి అంటే, వీటిని చల్లటి పాలలో వేసుకొని తింటే మరింత మంచి ఫలితం దొరుకుతుంది..
చపాతీల లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . కాబట్టి చపాతీలు తిన్న తర్వాత మరే ఆహారం పైన దృష్టి మల్లదు. తద్వారా ఆహారం తక్కువ తీసుకుంటారు .కాబట్టి బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ.. అందుకే ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారు , వారి ఆహారంలో ప్రతిరోజూ చపాతీలను చేర్చుకోవడం ఎంతో అవసరం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: