వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఉత్తమమైన ఆహారాలు.. ఇవే

kalpana
 మానవ శరీరంలో ఉండే అవయవాలు బాగా పని చేయాలంటే సరైన ఆహారం అవసరం. అంతేకాకుండా  ఆరోగ్యం కూడా ముఖ్యం. అన్ని అవయవాలు అన్ని అవయవాలు  ఆరోగ్యంగా ఉండాలంటే  వ్యాధి  నిరోధక శక్తి అవసరం. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే అనారోగ్యాలు కూడా తక్కువగా వస్తాయి. శరీరంలోని విషాలను బయటకు పంపడానికి మరియు వ్యాధుల మీద పోరాటం తెల్ల రక్త కణాలు చేస్తాయి. అందుకే ఒక నిరోధక శక్తి ఉండాలి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరగడానికి కావలసిన ఆహారాలను తినాలి. ఆ ఆహారాలు  ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
 శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇందులో పెరుగు తీసుకోవడం వల్ల దీంట్లో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటుంది. పెరుగు అనేక  వ్యాధి లక్షణాలను, మరియు మంటను కూడా తగ్గిస్తుంది. అందుకే ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
నిరోధక శక్తి పెరగడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే శరీరంలోని ప్రతి అవయవము పనిచేయాలంటే రోగ  నిరోధక శక్తి చాలా ముఖ్యం. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్ట ప్రతిరోజు  గ్రీన్ టీ తాగడం మంచిది. గ్రీన్ టీ తాగడం ఇష్టం లేని వాళ్ళు అందులోకి నిమ్మరసం తేనె కలుపుకొని తాగవచ్చు.
 విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్-డి సాధారణంగా సూర్యరశ్మి నుండి లభిస్తుంది. అలాగే సల్మాన్ చేపలు, బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది.
 పుట్టగొడుగుల్లో విటమిన్ బి,ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సీ, క్యాల్షియం, మరియు ఇతర ఖనిజాలు ఉండటంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వివిధ విధానాల వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. యాంటీ ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం తెల్ల రక్త కణాలు ఉత్తేజపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరగాలంటే ప్రతి రోజూ ఒక కప్పు పుట్టగొడుగులు తినడం మంచిది.
 చికెన్ సూప్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ప్రతిరోజు ఒక కప్పు చికెన్ సూప్ తాగాలి. ఇంకా మంచి ఫలితాలు కావాలంటే ఈ సూప్ లో రెండు వెల్లుల్లి కలుపుకొని  తాగాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: