ఎముకలు బలహీనంగా ఉన్నాయని బాధపడుతున్నారా..? అయితే ఇవి పాటించాల్సిందే..?

kalpana
 ప్రస్తుత కాలంలో ఎముకలు బలహీనపడి పోయి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కీళ్ల నొప్పులు అంటే 60 సంవత్సరాల వయసులో వచ్చేటివి.  కానీ ఇప్పుడు 30 సంవత్సరాల్లో నే కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దీనికి కారణం తీసుకొనే ఆహారంలో మార్పులు. కీళ్లనొప్పులను  తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే పౌడర్లను విరివిగా వాడుతున్నారు.  అయినా ఫలితం మాత్రం ఉండడం లేదు.  ఇలాంటి సమయంలో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఎలాంటి  ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలకు బలం వస్తుందో? ఎముకలకు అవసరమయ్యే పోషకాలు పదార్థాల్లో ఉన్నాయో?ఆ ఆహారాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 ముఖ్యంగా ఎముకలు బలహీనత డానికి కారణం కాలుష్య లోపం కాబట్టి కాలుష్యం ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఎముకలు దృడంగా మారుతాయి. అంతేకాకుండా పాలు తాగడం వల్ల కూడా మనకు కావాల్సిన కాల్షియం అందుతుంది. పాలను ప్రతి రోజు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి జరగడమే కాకుండా శరీరానికి కావల్సిన క్యాల్షియం ని అందిస్తాయి. దీనివల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.
 క్యాల్షియం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఎముకలు బలంగా ఉంటాయి. నారింజ పండులో అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు తీసుకోవడం మంచిది.  అలాగే విటమిన్ డి కూడా కుక్కల దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. అందుకే విటమిన్ డి ఉండే ఆహారాలను కూడా తీసుకోవడం మంచిది.
 అంజీర పండు లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మనకు కావాల్సిన కాల్షియం అందుతుందని నిపుణులు  తెలియజేస్తున్నారు. ఇందులో  ఉండే కాల్షియం ఎముకలు  దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది.
 విటమిన్ డి లోపం ఉండడం వల్ల కూడా ఎముకలు  బలహీన పడుతుంటాయి. ఇలాంటి వారు ఎండలో కొద్దిసేపు ఉండడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్-డి అందుతుంది. అంతేకాకుండా చేపలు, కోడిగుడ్లు, పాలు, పాలతో చేసిన పదార్థాలు అందులో భాగంగా చేర్చుకోవడం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
 అధిక బరువు వల్ల కూడా ఎముకలు బలహీనపడే డానికి ఆకాశం ఉంది.  కాబట్టి మొదట బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. ఇలా జరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే వ్యాయామాలు,  వాకింగ్, జాగింగ్ వంటివి కూడా చేయడం మంచిది. ఇలా  చేయడంవల్ల  ఎముకలు దృఢం గా ఉండడమే కాకుండా కీళ్లనొప్పుల సమస్యలు కూడా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: