కనురెప్పల వాపు లేదా మంటకు ఈ కారణాల ముఖ్యమైనవి కావచ్చు...!

Divya

నేత్రాలు మన శరీర భాగాలలో అతి ప్రధానమైనవి. అంతేకాకుండా  కళ్ళు ప్రతి ఒక్కరికి చాలా సున్నితంగా ఉంటాయి. దుమ్ము ,కాలుష్యం మరియు సూక్ష్మక్రిములు వల్ల సాధారణంగా కంటి చికాకు ,దురద మరియు ఎరుపుకు కారణం అవుతాయి. కనురెప్పల వాపు ను కూడా కొన్నిసార్లు కొన్ని కంటి వ్యాధి యొక్క లక్షణాలుగా పరిగణిస్తారు.

కొన్నిసార్లు మీరు ఉదయం లేవగానే మీ కనురెప్పలు ఒకటి లేదా రెండు కొద్దిగా వాచినట్లుగా మీకు అనిపించవచ్చు. కంటి మంటకు సాధారణ కారణం వైద్యశాస్త్రంలో చెప్పేది ఏమనగా..తామర సంక్రమణ వల్ల మాత్రమే రాదు.. ఇతర వ్యాధుల వల్ల కూడా కనురెప్పలలో మంట వస్తుంది అని చెప్పబడింది.
 కనురెప్పలు,  పైన చెప్పిన విధంగా చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి అలర్జీ ప్రతిచర్యలు కళ్ళను సులభంగా మరియు త్వరగా దాడి చేస్తాయి. దుమ్ము, ధూళి మొదలైన వాటి వల్ల  అలాగే కొన్నిసార్లు కాంటాక్ట్ లెన్స్ వల్ల కనురెప్పల లో మంట పుడుతుంది.

కళ్ళు ఎర్రబడటం: కండ్లకలక అనేది కంటికి సంబంధించిన ఒక సమస్య. ఇది కండర సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా బహిర్గతం కావడం వల్ల ఈ మంట వస్తుంది. ఇన్ఫెక్షన్ ద్వారా కంటి కార్నియా ఎర్రబడినపుడు మాత్రమే వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.
కంటి కనితి: ఈ కండ్లకలక కనురెప్పల లో మంటకు మరో కారణం, మరి కొన్నిసార్లు కణితి కనిపిస్తుంది. అలాగే స్వయంచాలకంగా అదృశ్యమౌతుంది. అలా చాలా అరుదుగా ఈ కనితి కనిపిస్తుంది. ఈ కనతి చాలా ప్రమాదాలను కలిగిస్తుంది. దీనికి కొన్ని సార్లు శస్త్రచికిత్స అవసరం. కనురెప్పల వాపు విషయంలో మీరు వెంటనే దాన్ని వదిలించుకోవటానికి కొన్ని సాధారణ వివరాలను అనుసరించవచ్చు లేదా కంటి వైద్యున్ని సంప్రదించండి.అంతేకాకుండా యాంటీబయోటిక్ వాడడం ద్వారా సాధారణ కంటి కణితిని నయం చేయవచ్చు.
కాంటాక్ట్ లెన్స్ ధరించడం: కాంటాక్ట్ లెన్స్ ధరించే వ్యక్తులలో కనురెప్పల వాపు తరచుగా వస్తుంది. అలా వచ్చినప్పుడు లేదా వాటిని తొలగించినప్పుడు శుభ్రంగా లేకపోతే ఈ నష్టం ఎప్పటికప్పుడు సంభవిస్తుంది. ఆ క్రిములు కళ్ళ పై దాడి చేస్తాయి. మరియు అపరిశుభ్రత కారణంగా మంటను కలిగిస్తాయి. ఇది చికాకు, నొప్పిని కలిగిస్తుంది. కానీ కాంటాక్ట్ లెన్స్ వాడకం వల్ల కంటి వాపు కు గురి కాదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా కీటకాలు ఇంట్లోకి ప్రవేశించడం లేదా ఒక బైక్ మీద వెళ్ళినప్పుడు ఏవైనా చిన్న కీటకాలు  కుట్టడం వంటివి చేయడం వల్ల, కనురెప్పల వాపు వస్తుంది. ఈ రకమైన గాయాలను నివారించడానికి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ మరియు గాగుల్స్ ధరించడం చాలా అవసరం. అలాగే ఖాళీ సమయాలలో చెట్టు కింద బయట మైదానం లో ఎక్కడ నిద్రపోకుండా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: