ఈ ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా... జాగ్రత్త..!

sangeetha
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఫ్రిడ్జ్ ఉండడం సర్వసాధారణం.అయితే ఈ రోజుల్లో మనం చేసుకున్న ఆహార పదార్థాలు మిగిలితే వాటిని మరి తినడం కోసం ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ విధంగా నిల్వ చేసుకున్న ఆహారపదార్థాలను మరి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనే విషయం మనకు తెలిసిందే.అయితే కొన్ని ఆహార పదార్థాలను మళ్లీమళ్లీ వేడి చేసి తినడం మనం చూస్తూనే ఉంటాం.ఈ విధంగా ఒకసారి వండిన ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసుకుని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
గుడ్లు:
ప్రతిరోజు కోడిగుడ్లు తినటం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం మనకు తెలిసినదే. గుడ్లలో అధిక సంఖ్యలో ప్రోటీన్లు ఉండటం వల్ల మన శరీర నిర్మాణానికి ఎంతో సహకరిస్తాయి. అయితే గుడ్లను ఏ రూపంలో తయారు చేసుకున్నా వెంటనే తినేయాలి. గుడ్లతో చేసిన ఆహార పదార్థాలు మిగిలిపోయి ఉండి మరలా వేడి చేసుకొని తినడం వల్ల ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్లు మనపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి. దీని ద్వారా తీవ్రమైన కడుపు నొప్పిని కలుగజేస్తాయి.
చికెన్:
చాలా మంది మిగిలిపోయిన చికెన్ మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటూ ఉంటారు. చికెన్ లో కూడా గుడ్లు మాదిరిగానే అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉండటంవల్ల అనేక సమస్యలకు దారి తీస్తుంది కాబట్టి చికెన్ కూడా చేసిన వెంటనే తినేయాలి.
ఆలుగడ్డలు:
ఆలుగడ్డలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఒక్క సారి మాత్రమే తినాలి. మళ్లీ మళ్లీ వాటిని వేడి చేసుకొని తినడం వల్ల ఇందులో హానికర బ్యాక్టీరియా ఏర్పడే ప్రమాదం ఉంది. తద్వారా వాంతి ,విరేచనాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పుట్టగొడుగులు:
పుట్టగొడుగులలో ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉంటాయి. అయితే వీటిని తాజాగా వండుకొని తిన్నప్పుడు మాత్రమే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మిగిలి ఉన్న పుట్టగొడుగులను తరువాత వేడి చేసి తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపే పరిస్థితులు ఏర్పడతాయి కనుక పుట్టగొడుగులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు.
అన్నం:
మనలో చాలామంది అన్నం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు చద్ది అన్నం లేదా అన్నాన్ని వేడి చేసుకుని తింటూ ఉండడం మనం చూస్తుంటాము. కానీ ఇలా చేయడం ముమ్మాటికి తప్పు.అన్నం చల్లబడే కొద్దీ అందులో ఉన్నటువంటి పోషక విలువలు కూడా తగ్గిపోతాయి.కనుక అన్నం వండిన వెంటనే వేడివేడిగా తిన్నప్పుడు మాత్రమే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
పై తెలిపిన ఆహారపదార్థాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ విధంగా ఆహార పదార్థాలను వేడి చేసి తినడం ద్వారా మన జీర్ణ వ్యవస్థ పై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపే అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: