మునగ ఆకులకు, మునగ పువ్వులకు ఆ శక్తి ఉంది.. అదేమిటి అనుకుంటున్నారా..? అయితే ఇక్కడ చదవండి...

kalpana
 మునగాకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా మునగాకును రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మహిళల్లో నెలసరి  సమయంలో వచ్చే నొప్పులను నియంత్రించుకోవచ్చు. ఇంకా అనేక రోగాలను నయం చేసుకోవచ్చు. మునగ ఆకు గాని, మునగ పువ్వులు గానే విరివిగా  దొరుకుతాయి. వీటిని వాడడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం...
 గర్భాశయం లో వచ్చే కంతుల సైజును తగ్గించడంలో మునగాకు  కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా మహిళలు గర్భం దాల్చినప్పుడు మునగాకు ను ఖచ్చితంగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
 మునగ ఆకుల్లో, మునగ  పువ్వుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జ్వరము, జలుబు వంటివి రాకుండా ఉంటాయి. జలుబు తో బాధపడుతున్న వాళ్లు మునగాకు సూప్ తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ సంబంధ సమస్యలను కూడా తొలగిస్తుంది.
 మునగ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు. పిల్లల్లో ఎముక సాంద్రతను పెంచే లక్షణాలు మునగాకు, గింజలకు ఉంది. అలాగే మధుమేహంతో బాధపడే వాళ్ళు మునగాకును  వారానికి మూడు సార్లు తీసుకోవడం వల్ల రక్తంలోని  చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.                                                    
 విరేచనాలు తగ్గడానికి మునగాకు  రసం ఒక స్పూన్ తీసుకుని, ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో కలిపి కాస్త తేనె కలిపి తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.
 మునగాకు లో ఉండే క్లోరోజనిక్ యాసిడ్ బ్లడ్ సుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే మునగాకు రసానికి, నిమ్మరసం కలిపి ముఖానికి  రాసుకోవడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: