పచ్చనివి తిందాం... పచ్చగా వుందాం...!

kalpana
 పసుపు రంగు కంటికి ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా, మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఆశావాదాన్ని పెంపొందించే వంతమైన రంగు కూడా పసుపు. అన్నిటికన్నా పసుపు రంగు ఆహారం చర్మ సంరక్షణకు చాలా మంచిది. వేసవికాలంలో ఎండకు కమిలి పోయినట్లు ఉండే చర్మానికి పసుపు రంగు పండ్లు బాగా పనిచేస్తాయి. వేసవికాలంలో, చలికాలంలో  దొరికే పసుపు రంగు పండ్లు గుమ్మడి, అరటిపండు, పైనాపిల్, మామిడి, పనస ఈ పండ్లు అన్ని  ఆరోగ్యానికి చాలా మంచివి.
 ముఖం మీద మొటిమలు రాకుండా చర్మ సౌందర్యానికి కూడా దోహదపడతాయి. ముఖ్యంగా పసుపు రంగులో ఉండే పండ్లలో విటమిన్ ఎ 1 శాతం అధికంగా ఉంటుంది. ఇది చర్మం మీద ముడతలు పడకుండా కాపాడుతుంది. వృద్ధాప్య ఛాయలు కనపడకుండా ఈ పండ్లు  కాపాడుతాయి. కాలుష్యం వల్ల, ఒత్తిడి వల్ల చర్మం పాడవకుండా పసుపు రంగు పండ్లు కాపాడుతాయి. చర్మము  ముడతలు పోవడానికి క్రీములు వాడటం కంటే సూపర్ రంగు పండ్లు ఆహారంగా తీసుకోవడం ఉత్తమమని చర్మ వైద్య నిపుణులు అంటున్నారు.
 పసుపు రంగు కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు పరిచే పోషకాలు అందుతాయి. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. వంకాయ, క్యాబేజీ, పుట్టగొడుగులు పచ్చిమిర్చి, ముల్లంగి ఇలా మరెన్నో కూరగాయల్లో కూడా పసుపు రంగు ఉంటాయి. అందరిని  ఆకట్టుకునే ఎరుపు రంగు ఆపిల్  కంటే పసుపు రంగు వాటిలో సహజమైన చక్కెర, పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని మధ్యాహ్నం స్నాక్స్లో తీసుకోవడం చాలా మంచిది.  అలాగే పసుపు రంగు ఆపిల్ ని తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.
 పసుపురంగు అంజీర పండు లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బి పి రోగులకు చాలా మంచిది. కొలెస్ట్రాల్ను తగ్గించే గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. పసుపు రంగు కూరగాయలు, పసుపు రంగు పండ్లలో బయో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. అవి అద్భుతమైన యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. అన్ని కలిపి గుండె ఆరోగ్యాన్ని, కంటి చూపును మెరుగు పరచడానికి సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: