నిత్యం బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

Divya

పూర్వకాలం నుంచి బెల్లం మంచి  ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే అప్పట్లో చాలామంది బెల్లంతో చేసిన వంటలు మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అని కూడా వారికి తెలుసు.. కానీ ఇటీవల కాలంలో బెల్లం తినడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదు. కానీ బెల్లం తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు కూడా చెబుతున్నారు.. అయితే బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

కాన్స్టిపేషన్ తో బాధపడేవారు ప్రతి రోజు ఒక చిన్న ముక్క బెల్లం తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే ఇందుకోసం మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం చేసిన తరువాత బెల్లం ముక్క నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే మలబద్దకం సమస్య తగ్గుతుంది

బెల్లం రక్తాన్ని శుద్ధి చేసే ఔషధ పదార్థంగా పనిచేస్తుంది. కాబట్టి నిత్యం తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అలాగే దగ్గు, జలుబు ఉన్నవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో బెల్లం వేసుకుని బాగా కలిపి, ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయట పడవచ్చు.

అంతేకాకుండా సహజసిద్ధమైన క్లీనింగ్ పదార్థం లా కూడా పనిచేస్తుంది. నిత్యం బెల్లం తినడం వల్ల లివర్ శుభ్రంగా మారి, అందులో ఉండే విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

బెల్లం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల తో పాటు జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

బెల్లం లో ఐరన్, ఫోలేట్ లు సమృద్ధిగా ఉంటాయి. బెల్లం తినడం వల్ల రక్తవృద్ధి కూడా జరుగుతుంది.ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అయి, రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు

అలాగే బెల్లం లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.10 గ్రాముల బెల్లం లో సుమారు 16 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది పేగులకు బలం చేకూర్చి, ఆ వ్యవస్థను సురక్షితంగా కాపాడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: