ముల్లంగి ఆకులను దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే..? ఏం జరుగుతుందో తెలుసా...?

kalpana
 ఒకప్పుడు ఉలవలను బాగా పండించే వాళ్ళు.  ఉలవలను ఎక్కువగా పశువులకు ఉడకబెట్టి పెట్టేవాళ్ళు వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉలవలు మూడు రంగుల్లో దొరుకుతాయి  నలుపు, తెలుపు, ఎరుపు. వీటిలో ఎక్కువ నల్ల ఉలవలు మంచివి. మిగతా  రెండు కూడా వాడుకోవచ్చు. అవి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఉలవలు శరీరానికి బాగా వేడిని కలిగిస్తాయి. కానీ వాతాన్ని, జలుబుని, భారాన్ని తగ్గించి శరీరాన్ని తేలికగా పరుస్తాయి.
 ఉలవలను  తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల నొప్పిని   తగ్గిస్తాయి. సాఫీగా జరిగేటట్లు చేస్తాయి. మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లలో కరిగించడానికి సహాయపడతాయి.
 ముల్లంగి  ఆకులను దంచి రసం తీసి ఆ రసంతో ఉలవచారు కాచుకుని తాగడం వల్ల మూత్రపిండాల్లో  ఉండే రాళ్లు త్వరగా కరుగుతాయి.
 స్త్రీలకు బహిస్టు సమయంలో వచ్చే సమస్యలను ఉలవలు సమర్థవంతంగా నివారిస్తాయి. ప్రసవించిన స్త్రీలకు మైల రక్తం పూర్తిగా బయటకు పోవడానికి ఉలవలు  బాగా తోడ్పడతాయి.
 బహిష్ఠు అయినప్పుడు ఉలవలను తీసుకుంటే రుతు  రక్తం బాగా అవుతుంది. రుతు  రక్తం సరిగా కానీ వారు మాత్రమే ఉలవలను  తీసుకోవాలి.
 ఉలవలను  ఉడికించి  గుగ్గుల  రూపంలో తీసుకోవడం వల్ల శరీరంలో  పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఉలవల చారు రూపంలో తీసుకోవడం వల్ల అనేక  రకాల వ్యాధులను నివారించుకోవచ్చు.
 బరువు తగ్గాలనుకునేవారు గొడవలు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి పోతుంది.ఫలితంగా బరువు తగ్గుతారు.  అలాగే దృఢత్వం ఏర్పడుతుంది.
 ఉలవలను, కొత్త  బియ్యాన్ని కలిపి జావా తయారు చేసుకొని దీన్ని పాలలో కలిపి కొన్ని వారాలు తీసుకోవడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది.
 ఉలవలను  గుప్పెడు తీసుకుని పెనము  మీద బాగా వేయించి ఒక గుడ్డలో పెట్టి ఉన్న చోట కాచుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వాపులు కూడా తగ్గుతాయి.
 ఉలవలను తీసుకోవటంవల్ల జీర్ణ  వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది. అలాగే ఆకలిని కూడా పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: