మనలో జింక్ లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏంటో తెలుసా..?

Divya

మన శరీరానికి చాలా పోషకాలు, విటమిన్లు అవసరం అవుతాయి. వీటిలో ఏ ఒక్క పోషకం లోపం జరిగిన మన శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన శరీరంలో వీటి ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అందులో భాగంగానే జింక్ కూడా ఒకటి. సూక్ష్మ పోషకాలలో జింక్  అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ జింక్ అనేక రకాల వృక్ష సంబంధ ఆహారాలతో పాటు జంతు సంబంధ పదార్థాలలోని మనకు పుష్కలంగా లభిస్తుంది.
మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందాలంటే జింక్ లోపం ఉండకూడదు. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం పై ఏర్పడిన పుండ్లు, గాయాలు త్వరగా తగ్గి పోవాలన్నా, వాపులు తగ్గాలంటే జింక్ ఉపయోగపడుతుంది...  ఒకవేళ జింక్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనలో జింక్ లోపం ఉన్నప్పుడు అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, చర్మం పై ఏర్పడిన గాయాలు పుండ్లు లాంటివి మానకుండా ఉండటం, స్పర్శ తగ్గిపోవడం, రుచి, వాసన చూసే శక్తిని కోల్పోవడం, విరేచనాలు అవ్వడం, ఆకలి ఉండదు. చర్మంపై ఉండే రంధ్రాలు తెరుచుకోబడతాయి. ఇలాంటి సమస్యలు మనలో కలిగినప్పుడు జింక్ లోపం ఏర్పడిందని తెలుసుకోవచ్చు.
అయితే ఈ జింక్ ఏయే పదార్థాలలో ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
తృణధాన్యాలు :
ధాన్యాలలో గోధుమలు,బియ్యం, క్వినోవా, ఓట్స్ వంటి పదార్థాలలో జింక్ అధికంగా లభిస్తుంది. కాబట్టి నిత్యం తగిన మోతాదులో వీటిని తీసుకోవడం ఉత్తమం
నట్స్ :
నట్స్ అనగా పల్లీలు, జీడిపప్పు,బాదం పప్పు లలో జింక్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని నేరుగా అయినా తినవచ్చు లేదా పెరుగు, ఓట్స్ లలో కలిపి తీసుకోవచ్చు.. అలాగే విత్తనాలలో కూడా పుష్కలంగా లభిస్తుంది. అందులో ముఖ్యంగా గుమ్మడి విత్తనాలు, నువ్వులలో లభిస్తుంది.
కూరగాయలు:
బంగాళాదుంపలు బీన్స్,బ్రోకోలి,పుట్టగొడుగులు,వెల్లుల్లి వంటి పదార్థాలలో జింక్ మనకు లభిస్తుంది.
ఇవే కాకుండా మాంసకృత్తులలో, కోడిగుడ్లలో ఈ జింక్ పుష్కలంగా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: