ఎండుమిర్చిని తెగ వాడేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

Divya

మిర్చి అంటేనే ప్రతి ఒక్కరు నోరు ఊదుకుంటూ ఉంటారు . ఇందుకు కారణం ఇది ఎంత కారం గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . మరీ ముఖ్యంగా  ఇందులో ఎండుమిర్చి అంటే ఎంత ఘాటుగా ఉంటుందో కూడా చెప్పలేం. ఈ పచ్చి మిర్చి, ఎండుమిర్చి లను రెండిటిని మనం కూరల్లో ఎక్కువగా వాడుతుంటాం. అయితే కూరలలో ఎక్కువగా కారం వాడటం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

కారం ఎక్కువగా తింటే కడుపులో మంట వస్తుంది. అలాగని ఊరగాయ, పచ్చళ్ళు తినాలన్న కోరికను బలవంతంగా అదుపులో పెట్టుకునే వారికి ఒక శుభవార్త. అలాగని మరీ ఎక్కువగా తినకూడదు..ఏదైనా మితంగా తినాలి అని గుర్తు పెట్టుకోవాలి. అయితే అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు అమెరికన్ పరిశోధకులు.

మిరపకాయలు, మిరియాలు విస్తృత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని యుఎస్ పరిశోధకులు కనుగొన్నారు. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా 5,70,000 మందికి పైగా ప్రజల ఆరోగ్యం, ఆహార రికార్డులను ఆ బృందం విశ్లేషించిన తరువాత చాలా గొప్ప ఫలితాలు వచ్చాయి.

ఏదిఏమైనప్పటికీ మిరపకాయ మన శరీరానికి రక్షణనిస్తుంది. మిరపకాయలను తరచూ తినడం వల్ల వ్యాధుల యొక్క తీవ్రతను తగ్గించుకోవడమే కాకుండా క్యాన్సర్ కణితి లను  కూడా తగ్గించుకోవచ్చట. అంతేకాక ఓహియో లోని క్లీవ్లాండ్ క్లినిక్ పరిశోధకుడు కార్డియాలజిస్ట్ బోజ్ ఈ పచ్చి మిరపకాయల పైన అధ్యయనం కూడా చేశాడు..

అలాగే తమ అధ్యయనంలో చైనా, ఇరాన్,ఇటలీ, యూఎస్ డేటాను సేకరించారు.  మొత్తం ఆరోగ్యంపై ఆహార కారకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని డాక్టర్ బోజ్ తెలిపారు. డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యల నుండి కూడా నియంత్రించే శక్తి ఈ పచ్చిమిరపకాయలకు ఉందట. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు పుష్కలంగా ఈ పచ్చిమిరపకాయలను వారి రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే డయాబెటిస్ తో బాధపడుతున్న వారు కూడా పచ్చి మిరపకాయలు తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుందని ఆయన తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: