జామ ఆకుల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... ఎవరు వదలరు...!

kalpana
 జామకాయ గురించి తెలియని వారు ఉండరు. జామకాయలు  తినడం వల్ల ఆరోగ్యానికి  చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ జామ ఆకుల వలన కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జామ కాయలు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.  అలాగే జామ ఆకుల రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. జామకాయలు, జామ ఆకులు రెండింటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 జామ ఆకులతో కషాయం చేసుకుని  తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఈ కషాయం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.జామ ఆకులను పది నిమిషాలు నీటిలో వేసి బాగా ఉడికించి చల్లారిన తర్వాత తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
 జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపి గుండెకు మేలు చేస్తాయి. అంతేకాకుండా పొటాషియం, కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి,  మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
 చాలామంది మహిళలు పీరియడ్స్ టైం లో పొట్టలో నొప్పి అని బాధ పడుతుంటారు. అలాంటివాళ్లు జామ ఆకుల రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
 జామ కాయలు తినడం వల్ల కూడా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియ బాగా జరగడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా డయేరియాను  కూడా తగ్గిస్తుంది.
 అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు జామ కాయలు తినడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. ఇందులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల తొందరగా ఆకలి తీరుతుంది. దీనివల్ల ఎక్కువ కేలరీలు శరీరానికి చేరవు.  ఫలితంగా బరువు తగ్గుతారు.
 జామ ఆకుల రసం తీసుకోవడం వల్ల కాన్సర్ కారకమైన కణాలను నాశనం చేస్తుంది. క్యాన్సర్ మందుల కంటే జామ ఆకుల రసం ఓట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
 జామకాయలో ను, జామ ఆకుల్లోని విటమిన్ సి అధికంగా ఉంటుంది. బాడీలో ఏర్పడే వివిధ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అందుకే అప్పుడప్పుడు జామకాయలను, జామ ఆకుల రసమును ఆగుతూ ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: