కంటి ఆరోగ్యం సురక్షితంగా వుండాలంటే ఏం చేయాలో తెలుసా..!

Divya

నేత్రం మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో అతి ప్రధానమైనది. శరీరాన్ని నిత్యం సంరక్షించుకున్నట్లే,  కళ్ళ ను కూడా సంరక్షించుకోవాలి. కళ్లపై ఒత్తిడి పడకుండా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు కళ్ళను పరీక్షించుకుంటూ, తగిన కంటి ఎక్సర్సైజులు చేస్తూ కళ్ళను భద్రంగా, ఆరోగ్యంగా ఉండే లాగా చూసుకోవాలి. అంతే కాకుండా మనం తినే ఆహారంలో విటమిన్ ఏ ఉండేలా జాగ్రత్తపడాలి. అయితే కళ్ళు మరింత ఆరోగ్యంగా, సహజసిద్ధంగా కంటిచూపు పెరిగేలా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మనం తినే ఆహారంలో విటమిన్ ఏ తో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల కళ్ళలోని కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా క్యారెట్లు, ఎరుపురంగు క్యాప్సికం,  బ్రోకలీ, పాలకూర, స్ట్రాబెర్రీలు, చిలకడదుంప,  నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల కంటి చూపు మెరుగుపడి,కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇక అలాగే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు, అవిసె గింజలు,బాదం పప్పు వంటి పదార్థాలను తినాలి. కెరటో నాయిడ్స్ ఉండే ఆకుపచ్చని కూరగాయలు, కోడిగుడ్లు తినాలి. అలాగే వారంలో కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలి. ప్రతి రోజు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం, యోగా,మెడిటేషన్ వంటివి చేయడం వల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఏదైనా ఒక వస్తువును అదే పనిగా చూస్తూ ఉండడం వల్ల కూడా కంటి సమస్యలు దూరం అవుతాయి.

ఇక కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ఎదుట గంటలతరబడి కూర్చొని పని చేసేవారు 20 -20 - 20 రూల్ ని పాటించాలి. అంటే ఇరవై నిమిషాలకొకసారి, 20 అడుగుల దూరంలో ఉండే వస్తువులను,కనీసం 20 నిమిషాలపాటు చూడాలి. ఇలా చూడడం వల్ల కళ్ళపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. పొగ ఎక్కువగా విస్తరించి ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: