చిక్కుడుకాయల్లో ఉండే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే, తప్పకుండా తింటారు...!

kalpana
 కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కూరగాయల్లో చిక్కుడుకాయ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడు కాయ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాయలు తినడం వల్ల ఆకలి తక్కువగా అనిపిస్తుంది.  ఫలితంగా తక్కువ తింటారు. అందుకే బరువు తగ్గుతారు. అంతేకాకుండా  ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 చిక్కుడుకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటి సమస్యలు తగ్గటమే కాకుండా, కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. అంతేకాకుండా మధుమేహం ఉన్నవాళ్లు చిక్కుడు కాయలు తినడం వల్ల మధుమేహం తగ్గుముఖం పడుతుంది.
 బరువు తగ్గాలనుకునేవారు చిక్కుడుకాయలను  ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుంది. కాబట్టి తక్కువ తినడానికి అవకాశం ఉంది. ఫలితంగా  బరువు తగ్గుతారు.
 గుండె ఆరోగ్యంగా ఉండడానికి, మెదడు పనితీరు బాగా జరగడానికి విటమిన్ బి 1 చాలా అవసరము. విటమిన్ బి 1 చిక్కుడుకాయ లో అధికంగా ఉంటుంది. కాబట్టి కూరగాయలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, మెదడు పనితీరు కూడా  సక్రమంగా జరుగుతుంది.
 చిక్కుడుకాయల్లో  కాపర్ అధికంగా ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలాక్టోజ్ వంటి రసాయనాలను విడుదల చేయడానికి కాపర్ ఉపయోగపడుతుంది. ఇవి శరీరంలోని అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్ లో విడుదల చేస్తాయి. ఫలితంగా వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. అంతేకాకుండా అనేక వ్యాధులు రాకుండా నివారిస్తాయి.
 దీర్ఘకాలిక శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి చిక్కుడుకాయ మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఎందుకంటే చిక్కుడుకాయ లో సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడానికి సహాయపడతాయి. కాబట్టి శ్వాసకోస  సంబంధ వ్యాధులను నిర్మూలిస్తాయి.
 చిక్కుడుకాయల్లో  మ్యాంగనీస్ అధికంగా ఉండటం వల్ల నిద్రలేమితో బాధపడే వాళ్లు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యానికి  సహాయపడతాయి. అంతేకాకుండా మానసిక ఆందోళనను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
 చిక్కుడుకాయల్లో పొటాషియమ్ ఉన్నందున నరాలు వృద్ధి చెందడానికి, వాటి పనితీరు మెరుగుపరచడానికి తోడ్పడతాయి. చిక్కుడు కాయలు తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు కచ్చితంగా చిక్కుడుకాయ ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: