నిమ్మ ఆకుల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే, ఆశ్చర్యపోతారు...!

kalpana
 నిమ్మకాయలు ఆరోగ్యానికి చాలా మంచివని మనకు తెలుసు. కానీ నిమ్మ ఆకులు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి నిమ్మకాయలను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నిమ్మ ఆకులను ఉపయోగించడం వల్ల కూడా అంతే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు  నిపుణులు తెలియజేస్తున్నారు. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్  ఏ, విటమిన్ సి, విటమిన్ బి 1, ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లెవిన్, సిట్రిక్ యాసిడ్ లు అధికంగా ఉంటాయి. అందుకే నిమ్మ ఆకులు కూడా దానికి చాలా మంచిది. నిమ్మ  ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటి వాటితో బాధపడుతున్నప్పుడు నీళ్ళను వేడి చేసి అందులో కొన్ని నిమ్మ ఆకులను  వేసి నానబెట్టాలి. రాత్రి పడుకునే ముందు ఆ నీటిని తాగడం వల్ల మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గుతాయి. అయితే నీటిని మరిగించి చకుండా వేడి చేసి మాత్రమే తాగాలి. ఇలా ఒక నెల రోజులు చేస్తే ఈ సమస్యలు తగ్గుతాయి.
 నిమ్మ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  అందుకే అందానికి  వాడే ప్రోడక్ట్ ల్లో నిమ్మ ఆకుల్ని కలుపుతుంటారు.
 నిమ్మ ఆకులను బాగా నలిపి వాసన చూస్తుంటే మానసికంగా డిప్రెషన్ లో ఉన్నవాళ్లు ఒత్తిడి నుంచి బయటపడటమే కాకుండా ఉత్సాహంగా ఉంటారు.
 నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్లు నాలుగు తాజా నిమ్మ ఆకులను తీసుకొని గ్లాసు నీటిలో సుమారుగా మూడు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా, గుండె దడ, నరాల బలహీనత వంటి  సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
 ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గించుకోవడానికి  నిమ్మ ఆకులు బాగా ఉపయోగపడతాయి.  ఎలా అంటే నిమ్మ ఆకులను బాగా నూరి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలతో పాటు మచ్చలు కూడా తగ్గిపోతాయి.
 నోటి దుర్వాసన, దంతాల సమస్యలు, వంటివి ఉన్నప్పుడు నిమ్మ ఆకులను ఉపయోగించుకొని సమస్యలను తగ్గించుకోవచ్చు. నిమ్మ ఆకులను మెత్తగా  నూరి పంటి నొప్పి ఉన్న చోట ఉంచడం వల్ల నొప్పి తగ్గడమే కాకుండా, దంతాలపై ఉన్నా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీనివల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
 చర్మ సమస్యల తో బాధపడుతున్నప్పుడు స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకుని స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా నిమ్మ ఆకులను బాగా నలిపి చేతులకు రాసుకోవడం వల్ల చేతుల పై ఉన్న బ్యాక్టీరియాను చంపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: