దగ్గు, జలుబు నుంచి శాశ్వతంగా దూరం అవ్వడానికి ఈ చిట్కాలు పాటించండి....

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..జలుబు సమస్య మనం సాధారణంగా ఎదురుకుంటున్న ముఖ్యమైన సమస్య ఇది.అన్ని కాలాల్లోనూ పట్టి పీడించే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. మాములుగా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు, కాలాలు మారినప్పుడు మనకు తరుచూ జలుబు రావడం సహజం.ఇక దగ్గు తో కూడా మనం ఎప్పుడు బాధ పడుతూ ఉంటాము. ఇక దగ్గు కూడా  ఎన్ని మాత్రలు వేసుకున్నా దగ్గు తగ్గదు. ఇక పొడి దగ్గైతే సుమారు వారం, పదిరోజుల పాటు వీడదు. అయితే అది తగ్గడానికి మన ఇంటి కిచెన్ లోనే ఔషధాలున్నాయి.

జలుబు వేధిస్తుంటే వేడి నీటిని తీసుకోవడమే ఉత్తమం. చల్లగా ఉండే నీరు, ద్రవాలు తీసుకుంటే అది లేని పోని సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.పసుపు.. సర్వ రోగ నివారిణి అయిన పసుపులో పాలు కలిపి తాగితే పొడి దగ్గు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.అలాగే, పొడి దగ్గు తీవ్రంగా వేధిస్తే ఉసిరికాయలను తీసుకుంటే ఎంతో ఉపయోగకరం.పొడి దగ్గు తీవ్రంగా వేధిస్తే యాలకులలో అల్లం ముక్కలు కలిపి నమిలితే ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.అల్లం, లవంగాలలో కొంత ఉప్పు వేసుకుని నమిలితే దగ్గు నుంచి తక్షణ ఉపశమనం పొందొచ్చు.ఇది అందరికీ తెలిసిన చిట్కానే.. వేడి నీటిలో ఉప్పును వేసి నోటిలో పుకిలించడం వల్ల గొంతుకు ఉపశమనం కలుగుతుంది.

అల్లం, నిమ్మరసం, మిరియాలు, బెల్లాన్ని కలిసి ఒక గ్లాసు నీటిలో వేడి చేయండి. దీనిని వేడిగా ఉన్నప్పుడు తాగితేనే శ్లేష్మం (జలుబు) తగ్గే అవకాశం ఉంది.అల్లం టీ తాగడం వల్ల జలుబు, కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు.నిమ్మ.. ప్రకృతి ప్రసాదించిన ఫలాలలో నిమ్మ జాతి ఎన్నో పోషకాలతో కూడుకున్నది. పొడి దగ్గును నివారించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక నిమ్మకాయ ముక్కను కోసి దానిలో చక్కెర, మిరియాలు వేసి.. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే జలుబు సమస్యను ఇట్టే నివారించవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: