ఉలవచారు దాచుకున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా...

Divya

పూర్వ కాలంలో ఉలవలను విస్తృతంగా వాడేవారు. కాలం మారుతున్న కొద్దీ క్రమేణా,గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉలవల సాగు అంతరించిపోతోంది. అయితే ప్రస్తుతం వీటిని ఎవరు ఎక్కడ పండిస్తున్నారో? ఎవరు వాడుతున్నారో అని కూడా అర్థం కావడం లేదు. అయితే కొన్ని రెస్టారెంట్లు ఆహార ప్రియులను ఆకర్షించేందుకు గాను, ఉలవచారు బిర్యానీ లాంటి కాంబినేషన్లతో ఆహార ప్రియులను బాగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ఉలవలను ఎక్కువగా గుర్రాలకు పెడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఉలవలు కేవలం గుర్రాలకే కాకుండా మనుషులకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఉలవలును మరీ ముఖ్యంగా చారు చేసుకొని తాగడం వల్ల  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఉలవచారు గర్భాశయ దోషాలు మీద ఔషధంగా పని చేస్తుంది. నెలసరి సరిగ్గా రాని వారికి, తెల్లబట్ట వంటి సమస్యలు ఉన్నవారికి కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
ఉలవచారు లో పెరుగు కలిపి, బాగా చిలికి మజ్జిగ తయారు చేసుకొని, భోజనం తర్వాత తాగితే,దగ్గు, జలుబు, ఆయాసం,తుమ్ములు తగ్గడమే కాకుండా కఫము, వాత దోషాలు తగ్గుతాయి.
మూల వ్యాధులకు, మొలలు చికిత్స కు ఉలవచారు ఎంతో ఉపకారం చేస్తుంది . ఈ సమస్యలతో బాధపడుతున్నవారు ఉలవచారు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే మొలల సమస్య కారణంగా రక్తస్రావం జరుగుతుంటే ఉలవలకు దూరంగా ఉండటం మంచిది.
ఉలవలకు వేడి చేసే గుణం ఎక్కువ కాబట్టి, ఆ వేడి తగ్గాలంటే ఉలవచారు లో ముల్లంగి రసాన్ని కలిపి చారుల చేసుకొని తాగాలి. ఇక ముల్లంగి కి చలువ చేసే గుణం ఉండడం తో పాటు మూత్రపిండాల పనితీరును దృఢంగా మారుస్తుంది .
విరేచనాలతో బాధపడుతున్నవారు ఉలవచారు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్లు కరిగించి,త్వరగా బయటకు వచ్చేలా చేస్తుంది.
ఉలవచారుకు అలసటను, శ్రమను పోగొట్టి, బలాన్నిచ్చి,నొప్పులు తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. శ్రమను తట్టుకునే శక్తి విలువలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే, వీటిని గుర్రాలకు,వ్యవసాయ పశువు లకు ఉడికించి పెడతారు. ఇక వీటిని మనం తీసుకోవడం వల్ల శారీరక పుష్టి కూడా కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: