పచ్చిమిర్చి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Divya

సాధారణంగా పచ్చిమిర్చి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఘాటైన వాసనతో పాటు కారంగా ఉంటుంది అని . పచ్చిమిర్చి లేనిదే ఏ వంట పూర్తవదు. మనం వండే ఏ వంట అయినా దాని  రుచి కోసం తప్పకుండా పచ్చిమిర్చిని వాడాల్సి ఉంటుంది. అలా పచ్చిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చిమిరపకాయలు ఇంత ఘాటుగా ఉండడానికి గల కారణం "క్యాప్ సైసిన్ " తో పాటు అనేక రసాయనాలు కలిగి ఉండడం వల్ల పచ్చిమిరపకాయల కు అంత ఘాటుగా ఉంటాయి. ముఖ్యంగా పచ్చిమిరపకాయలలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఆ  ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

పచ్చిమిర్చిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువగా తినే వారు కొన్ని రకాల వ్యాధులు అయిన ముఖ్యంగా గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ బారి నుండి రక్షణ కల్పిస్తుంది:
పచ్చిమిరపకాయలలో  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి  ఫ్రీరాడికల్స్ నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి.దాంతో క్యాన్సర్ కణాలను నిర్మూలించి, క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేకాకుండా ఏజింగ్ ప్రాసెస్ ను కూడా నిదానం చేస్తుంది.
రోగనిరోధకను మెరుగుపరుస్తుంది:
భారతీయ పచ్చిమిరపకాయలలో  ఎక్కువగా విటమిన్ సి ఉండటం వల్ల, ఇది మూసుకుపోయిన నాసికా రంధ్రాలను  తెరచుకొనేలా చేసేందుకు  సహాయ పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి  వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
చర్మ రక్షణకు ఉపయోగపడుతుంది:
పచ్చిమిరపకాయలలో  విటమిన్ ఇ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మంలోని నాచురల్ స్కిన్ ఆయిల్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి తగిన మోతాదులో పచ్చిమిరపకాయలు తీసుకోవడం వల్ల మంచి అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
బరువు తగ్గడం:
ముఖ్యంగా పచ్చిమిరపకాయలను తినడం వల్ల నోటి మంటతో పాటు కడుపులో కూడా మంట పుడుతుంది. తద్వారా అందులో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగించేస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైనట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. మిరపకాయ తినడం వల్ల శరీరంలో పుట్టే వేడి కారణంగా శరీరంలోని అధిక కేలరీలను పెంచి కొవ్వులను కరిగిస్తుందని  పరిశోధకులు వెల్లడించారు
మద్యం సేవించేటప్పుడు:
ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మగవారు,ఆడవారని తేడా  కూడా లేకుండా మద్యం ప్రియులు ఎక్కువైపోతున్నారు.  ఇలాంటివారు మద్యంతో పాటు పచ్చిమిరపకాయలను కూడా తినడం వల్ల లివర్ చెడిపోయే ప్రమాదం నుంచి బయటపడవచ్చని రీసెంట్ గా జరిగిన ఒక పరిశోధనలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: