ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి...!

kalpana
మనం ఎంత అందంగా ఉన్నా దంతాలు సరిగా లేకుంటే అందంగా కనిపించరు. పళ్ళు వంకర టింకరగా ఉన్నా,ఎత్తు పళ్ళు ఉన్న హేళన చేస్తుంటారు.గార పట్టిన పళ్ళ కు ఎలాంటి ట్రీట్మెంట్ చేసిన ఫలితం మాత్రం అంత మాత్రమే ఉంటుంది.అలా కాకుండా దంతాలు సురక్షితంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఆ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
 దంతాలను చాలాసేపు తోమడం వల్ల లేదా గట్టిగా తోమడం వల్ల పళ్లపై ఉండే ఎనామెల్ దెబ్బతింటుంది.దీనివల్ల నొప్పి, చిగుళ్ల వాపులు వస్తాయి.
 రోజుకొకసారి స్ట్రాబెర్రీ ని పళ్లకు రాసుకునే తర్వాత బ్రష్ తో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు తెల్లగా ఉంటాయి. దంతాలపై ఉండే పసుపు పదార్థాన్ని తొలగించడానికి స్ట్రాబెర్రీ లో ఉన్న మాలిక్ యాసిడ్ సహాయపడుతుంది.
 దంతాలు తెల్లగా ఉండాలనుకుంటే ఇంట్లో ఉండే తినే సోడా తో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు తెల్లగా ఉంటాయి. శుభ్రంగా కూడా ఉంటాయి.
 పంటి సమస్యలు, నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే,పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి నమలడం వల్ల ఈ సమస్యలు ఉండవు.
 దంతాలు గట్టిగా ఉండటానికి పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవడం వల్ల పళ్ళు సమస్యలు తగ్గి, దృఢంగా ఉంటాయి.
 తెల్లగా ఉన్న దంతాలను పసుపు రంగుగా మారడానికి కారణం కాఫీ, టి వంటివి తాగడం వల్ల పళ్ళు పచ్చగా మారుతుంటాయి. కాబట్టి కాఫీ, టి తాగిన తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి.
 ముఖ్యంగా చల్లని నీటిని గాని, చల్లని కూల్ డ్రింక్స్ కానీ తాగకుండా ఉండాలి. ఒకవేళ తాగాలనుకుంటే, పళ్లకు తగలకుండా తాగడం మంచిది.                                                                                                                                                                                                                                                           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: