బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Divya

ప్రస్తుతకాలంలో మార్కెట్లోకి చక్కర,  షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత బెల్లం వాడకం చాలా తగ్గిపోయింది.  పూర్వకాలంలో బెల్లం తప్ప మరేతర తీపి పదార్థాన్ని వాడే వారు కాదు. కానీ ప్రస్తుత కాలంలో బెల్లం అంటేనే చిరాకు పడుతున్నారు.ఇందుకు కారణం బెల్లం తయారీ లో ఉపయోగించే కొన్ని మూలకాల కారణంగా బెల్లం నుండి ఒక రకమైన వాసన వస్తుంది. ఈ వాసన కారణంగా చాలామంది బెల్లం తినడానికి ఇష్టపడరు. కానీ నిత్యం బెల్లంను ఆహారంలో చేర్చుకోవడం వల్ల, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ  చదివి తెలుసుకుందాం.
ఒక  టేబుల్ స్పూన్ బెల్లం, ఒక టేబుల్ స్పూన్ తేనె రెండూ సమపాళ్ళలో కలిపి ఆహారంతోపాటు కలిపి తీసుకుంటే ఐదు నుంచి ఆరు రోజుల్లో మైగ్రేన్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
లివర్ ని శుభ్రపరచడంలో బెల్లం మొదటి పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా లివర్ లో ఉన్న హానికర వ్యర్థాలను,విషపదార్థాలను బయటకు నెట్టివేస్తుంది.
బెల్లంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. దీనిని రోజూ  తినడం వల్ల కణాల్లో ఆమ్లాలు,అసిటోన్ ల పై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది.
శరీరంలో ఏదైనా ఒక భాగం నొప్పికి గురి అయినప్పుడు బెల్లంను వేడి చేసి,నొప్పి ఉన్న చోట పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
జలుబు చేసి ముక్కు కారే సమస్య అధికమైనప్పుడు, పెరుగుతో పాటు బెల్లాన్ని కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
బెల్లంలో ఉండే ఔషధ గుణాల కారణంగా జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తాయి.
శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించడంతో పాటు అధిక నీటిని బయటకు పంపుతుంది.అధిక బరువు తగ్గుతారు. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. శరీరంలో రక్తం నిల్వలు పెరుగుతాయి.బెల్లం రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: