పసుపుతో పొడిదగ్గుకు చెక్ పెట్టండిలా

Naga Sai Ramya
పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ అలాగే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే అనేక హెల్త్ కండిషన్స్ కు మంచి రెమెడీగా పసుపు పనిచేస్తుంది. పొడిదగ్గుకు కూడా పసుపుతో రిలీఫ్ పొందవచ్చు.


పసుపులో పొడిదగ్గుకు చెక్ పెట్టే హీలింగ్ పవర్ ఉంటుంది. కాసిన్ని పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని బాగా కలిపి తాగితే పొడిదగ్గు నుంచి విముక్తి లభిస్తుంది.


అలాగే, కుర్కుమిన్ అనే కాంపౌండ్ ను బ్లాక్ పెప్పర్ తో కలిపి తీసుకుంటే కూడా వెంటనే దాని ప్రభావం శరీరంపై పడుతుంది. పొడి దగ్గు నుంచి రిలీఫ్ తొందరగా లభిస్తుంది. ఒక టీస్పూన్ పసుపు అలాగే చిటికెడు బ్లాక్ పెప్పర్ ను వెచ్చటి పాలలో కలిపి తీసుకుంటే ఉపశమనం వస్తుంది.  


పసుపు అనేది అనేక అప్పర్ రెస్పిరేటరీ కండిషన్స్ కు మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు. బ్రాన్కైటీస్, ఆస్త్మా వంటి కండిషన్స్ వల్ల వచ్చే దగ్గుకు కూడా పసుపుతో రిలీఫ్ పొందవచ్చు.


అలాగే, తేనె నుంచి కూడా పొడిదగ్గు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. తేనెలో కూడా యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది గొంతులోని ఇరిటేషన్ ను తగ్గిస్తుంది. 


ఒకానొక స్టడీ ప్రకారం తేనెలో ఉండే ఓ పదార్థం పిల్లల్లో రాత్రిపూట దగ్గును తగ్గిస్తుందని తేలింది. తేనెను వెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే పొడిదగ్గు నుంచి రిలీఫ్ పొందవచ్చు.


అలాగే పొడిదగ్గుకి పొడిగాలి కూడా కారణమవుతుంది. గాలిలో తేమశాతాన్ని పెంచడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. రిలీఫ్ పొందవచ్చు. నిద్రించే ముందు హ్యూమిడిఫయర్ ను రన్ చేస్తూ ఉంటే మీకు ఫలితం కనిపిస్తుంది. 


దుమ్ము అలాగే పొగతో పాటు గాలి ద్వారా వ్యాపించే ఇరిటెంట్స్ వల్ల కూడా పొడిదగ్గు వస్తుంది. ఎయిర్ ప్యూరిఫయర్స్ ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి హెల్ప్ చేస్తాయి.

అలాగే, గార్గ్లింగ్ చేసినా కూడా పొడి దగ్గు నుంచి రిలీఫ్ వస్తుంది. వెచ్చటి నీటిలో కాసింత ఉప్పును వేసుకుని నోట్లో గార్గ్లింగ్ చేస్తే గొంతులో అలాగే నోట్లో ఉన్న బాక్టీరియా అనేది నశింపబడుతుంది. రోజుకు కొన్ని సార్లు ఇలా గార్గ్లింగ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: