దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందటానికి పాటించాల్సిన చిట్కాలివే...?

Reddy P Rajasekhar
దేశంలో విజృంభిస్తున్న కరోనా ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దగ్గు, జలుబు కరోనా లక్షణాలు కావడంతో సాధారణ దగ్గు, జలుబు వచ్చినా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సి వస్తోంది. వర్షాకాలం, శీతాకాలంలో మనలో చాలామందిని దగ్గు, జలుబు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే ప్రతిసారి దగ్గు, జలుబును ట్యాబ్లెట్లను వినియోగించి తగ్గించుకోవడం సరి కాదు. కొన్ని వంటింటి చిట్కాలను పాటించి దగ్గు, జలుబు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
 
జలుబు, దగ్గు సమస్యలు ఉంటే ఆవిరి పట్టడం ఉత్తమం. నీటిలో పసుపు లేదా జండూబామ్ వేసి ప్రతిరోజూ పది నుంచి 15 నిమిషాలు ఆవిరి పడితే శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తొలగుతాయి. నీటిలో వాము, తులసి ఆకులు వేసి మరిగించి రోజుకు రెండుసార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది. సర్వరోగ నివారిణి తేనె జలుబు, దగ్గు సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండే తేనెలో నల్ల మిరియాల పొడి వేసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు సమస్యలు దూరమవుతాయి.
 
అంటువ్యాధులతో పోరాడేందుకు ఉత్తమమైన వాటిలో పసుపు పాలు కూడా ఒకటి. గోల్డెన్ మిల్క్ పేరుతో పిలిచే పసుపు పాలు జలుబు, దగ్గు లాంటి సమస్యలను తక్కువ సమయంలో తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండే తులసి ఆకులు కూడా రోగనిరోధక శక్తిని పెంచి దగ్గు, జలుబు సమస్యలను తగ్గిసాయి. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్డే వెల్లుల్లి దగ్గు, జలుబుతో పాటు ఇతర వ్యాధులను తగ్గిస్తుంది.
 
వాల్‌నట్, జీడిపప్పు, బాదం, వేరుశనగ లాంటి నట్స్ మన శరీరాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉంచడంలో సహాయపడి సమస్యలు తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. బ్రౌన్ రైస్, క్వినోవా, బజ్రా లాంటి తృణధాన్యాలను మన డైట్ లో భాగం చేసుకుంటే మంచిది. ప్రొటీన్స్‌, కేలరీలు అధికంగా ఉండే కోడిగుడ్లు సైతం దగ్గు, జలుబుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. చలికాలం మనల్ని వెచ్చగా ఉంచే అత్యుత్తమ పదార్థం సూప్‌. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే సూప్ లను తరచూ తీసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: