వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబుతో బాధ పడుతున్నారా.... ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..?

Reddy P Rajasekhar

వర్షాకాలం వచ్చిందంటే దగ్గు, జలుబు సమస్యలు మనలో చాలామందిని వేధిస్తూ ఉంటాయి. కరోనా లక్షణాల్లో దగ్గు, జలుబు ఉన్నప్పటికీ ఈ లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ వైరస్ భారీన పడినట్లు కాదు. పలు రకాల వైరస్ ల వల్ల మనం ఎక్కువగా దగ్గు, జలుబు భారీన పడతాం. అయితే కొన్ని సాధారణ చిట్కాలను పాటించి వర్షాకాలంలో సోకే సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం సులభంగా రక్షించుకోవచ్చు. 
 
జలుబు, దగ్గు సమస్యలు ఉంటే మనం మనశ్శాంతిగా ఏ పని చేయలేం. ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జలుబు, దగ్గు భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఆయుర్వేద నిపుణులు పసుపు కలిపిన పాలు తీసుకుంటే దగ్గు మరియు జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు. అల్లంతో చేసిన వేడి టీ తాగినా దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. 
 
గోరువెచ్చగా ఉండే నీటిని తాగడం ద్వారా జలుబును సులువుగా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీరు గొంతు భాగంలో ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. నిమ్మరసానికి కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి తయారు చేసిన సిరప్ కూడా దగ్గు, జలుబును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల దగ్గు, జలుబు నుంచి త్వరిత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. 
 
టీ స్పూన్ మునగాకు రసాన్ని వారానికి రెండు, మూడుసార్లు తీసుకోవడం ద్వారా కూడా వైరస్ భారీన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. నీళ్లలో శొంఠిని కషాయంగా కాచి అందులో కొంచెం పటిక బెల్లం వేసి ఉదయం, సాయంత్రం సేవించినా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక స్పూన్ తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే దగ్గు, జలుబు త్వరగా తగ్గుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: