దగ్గు ఎక్కువగా వస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

Durga Writes

దగ్గు.. ఇప్పడు కరోనా కాలం నడుస్తుంది. ఇప్పుడు చిన్నగా దగ్గినా.. తుమ్మినా.. ముక్కు తుడుచుకున్న డైరెక్ట్ ఖ్వారెంటైన్ కే. అయితే దగ్గు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా పాజిటివ్ కాదు అనుకోండి.. అయితే ప్రస్తుతం సీజన్ లో చెప్పలేనన్ని మార్పులు ఉన్నాయి కాబట్టి దగ్గు, తుళ్లు సాధారణం అయ్యాయి. 

 

అందుకే దగ్గు వచ్చిన ఎవరు పెద్దగా భయపడటం లేదు. మొన్నటి వరకు అంటే సమ్మర్ కాబట్టి అందరూ భయపడ్డారు కానీ లేకపోతే భయపడేవారు కాదు. సరే.. కరోనా అని భయపడిన లేకపోయినా మనకు దగ్గు అయితే తగ్గాలి. ఇంకా అలాంటి దగ్గుకు మందు తయారు చేసుకోవచ్చు. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

పసుపులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పసుపులో ఉండే కార్టూమన్స్ దగ్గును తగ్గిస్తాయి. దగ్గు తగ్గడం కోసం కొద్దిగా పసుపు, కాస్త తేనె కలిపిన మిశ్రమాన్ని తాగండి. ఈజీగా తగ్గుతుంది. 

 

సొంటి ఫౌడర్, తేనె మిశ్రమాన్ని నిత్యం తీసుకుంటే పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

 

గోరు వెచ్చని పాలల్లో కొద్దిగా మిరియాల పొడి వేస్తే దగ్గు నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు.

 

అల్లం టీని రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు.

 

కఫం దగ్గువేధిస్తుంటే.. గ్లాసుడు నీటిలో ఉప్పు వేసి కలపండి. ఆ నీటిని నోటిలో వేసుకుని పుకిలించండి.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మిమ్మల్ని వేధించే దగ్గును పోగుట్టుకోండి.                                                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: