అంజీర పండ్ల వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

Durga Writes

అంజీర పండ్లను ప్రాంతాన్ని బట్టి వేరు వేరు పేర్లతో పిలుస్తారు. కొందరు ఈ పండ్లను సీమ అత్తి, మంచి మేడి, ఇతర పేర్లతో పిలుస్తారు. కొన్ని పండ్లు ఎండిపోయిన తరువాత వాటిలో పోషకాలు రెట్టింపు అవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. ఈ పండ్లు రక్తహీనత సమస్యను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఈ పండ్లలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పాస్ఫరస్, క్లోరిన్, పాలిఫినోల్స్, ప్లవనోయిడ్స్ ఉంటాయి.

 

రక్తపోటు సమస్యతో బాధపడేవారు రోజూ ఈ పండ్లు తింటే బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఉబ్బసం సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ పండ్లు తింటే అలుపు, అలసటలు తగ్గి శ్వాస ధారాళంగా ఆడుతుంది. నాలుక మంట, పెదవుల పగుళ్లు, నోటిలో పుండ్లు లాంటి సమస్యలు ఈ పండ్లు తింటే దూరమవుతాయి. ఈ పండ్లు శరీరంలోని వేడిని తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడతాయి.

 

ఈ పండ్లలో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు హృద్రోగ సమస్య నుంచి దూరం చేస్తాయి. నిద్రలేమి సమస్యను దూరం చేయడంలో, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఈ పండ్లు సహాయపడతాయి. ఈ పండ్లు రోజూ తినేవారు కొన్ని రకాల క్యాన్సర్ల భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ పండ్లు తింటే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. బలహీనంగా ఉన్నవారు ఈ పండ్లు రోజూ తింటే త్వరగా బరువు పెరుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: