భరించలేని దగ్గుని తరిమికొట్టే  సహజసిద్ద మార్గాలు ఇవే...!!!

NCR

రోగాలు కాలానికి తగ్గట్టుగా కాచుకుని కూర్చుంటాయి. ఇంకొన్ని రోగాలు కాలంతో సంభంధం లేకుండా మనిషిపై విరుచుకుపడుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే రోగాలు కాలం పొడవునా కొందరిని వేధిస్తూ ఉంటాయి. అలాంటి రోగాలలో ఒకటి దగ్గు, జలుబు. శీతాకాలం ఎంట్రీ ఇచ్చిందంటే చాలు చాలామంది భయపడిపోతుంటారు. ఈ కాలంలో వచ్చే దగ్గు ఒక పట్టాన తగ్గదు సరికదా పొడి దగ్గులా వచ్చి తలలో నరాలు లాగేసేలా విపరీతంగా భరించలేని విధంగా దగ్గు వస్తుంది.

ఈ దగ్గు ప్రభావంతో మందులు, అరుకులు, అంటూ ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. అయితే ఇంట్లోనే సహజసిద్ధంగా, దగ్గు, జలుబుని తగ్గించే ఔషదాన్ని మనమే తయారు చేసుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంగ్లీషు మందులు వాడకుండానే దగ్గు సులభంగా తగ్గిపోతుందట, అది కూడా ఇంట్లో దొరికే పదార్ధాలతోనే ఈ మందుని తయారుచేసుకోవచ్చని అంటున్నారు...అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచం నిమ్మరసం తీసుకోవాలి , అందులో కొంచం తేనే కలుపుకుని త్రాగితే దగ్గు నుంచీ పూర్తి ఉపశమనం కలుగుతుంది. అలాగే హెర్బల్ టీ లో తేనే కలుపుకుని త్రాగినా సరే దగ్గునుంచీ ఉపశమనం కలుగుతుందని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అలాగే పైనాపిల్ పండ్లు అందుబాటులో ఉన్నా వాటిని తినడం వలన కూడా దగ్గుని కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు షాపుల్లో దొరికే కరక్కాయి తీసుకుని ఒక చిన్న ముక్కని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ రసాన్ని తీసుకున్నా సరే దగ్గు త్వరగా కంట్రోల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: