అంజీర పండుతో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌..!

Kavya Nekkanti
కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి ఏడాది పొడుగునా మార్కెట్‌లో లభ్యమవుతూనే ఉంటుంది. అయితే కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటివల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ, కొన్ని పండ్లలో తాజాకన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయి. అలాంటి వాటిల్లో అంజీర కూడా ఒకటి. వీటిల్లో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. సి, ఎ, బి6 విటమిన్లు,  పొటాషియం, కాల్షియం పుష్కలం. 


అదే విధంగా సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌లాంటి  ఇతర ఖనిజ లవణాలు కూడా తగు మోతాదులో ఉన్నాయి. పిల్లలు లేని వారు, కనాలనుకునే వారు అంజీర పండ్లు రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిది. ఈ పండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బ‌ల‌హీన‌త‌ను పోగుడుతుంది. అదే విధంగా.. ఈ కాలంలో అధిక రక్తపోటు సమస్య అందరినీ వేధిస్తోంది. దీనికి సరైన మందు అంజీర పండు. పండైనా లేదా ఎండుదైనా రోజూ తింటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. 


అంజీర పండు తినడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంచుతుంది. దీనిలో ఉండే పొటాషియం పొలిఫెనల్స్, ప్లెవొనోయిడ్స్, యాంటిఆక్సిడెంట్స్‌లు టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో అంజీర్ బాగా ఉపయోగపడుతుంది.  బరువు తగ్గడానికి , ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.  గుండెజబ్బులు, క్యాన్సర్‌లకు  మంచి ఔషధం. ఏ వ్యాధితో బాధపడుతున్నవాళ్లయినా అంజీర్‌ను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: