పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా.. నిజ‌మెంతా..

Kavya Nekkanti
మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే పాల‌కూర తింటే కిడ్నీలో రాళ్లు వ‌స్తాయా? అన్న ప్ర‌శ్న‌చాలా మందిలో ఉంది. కానీ అది వాస్తవం కాదని అంటున్నారు. 


వాస్త‌వానికి పాలకూర తింటే రాళ్లు రావు. కానీ రాళ్లు వచ్చే అవకాశం ఉన్నవారిలో ఒక్సాలేట్స్‌ వల్ల రాళ్లు ఏర్పడవచ్చు. సరైన మోతాదులో నీటి పదార్థాలు తీసుకోనివారు, ఎక్కువగా ఎండలో తిరిగే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. ఆహారంలో నీటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. 


అయితే పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది. స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: