ధ‌నియాల‌లో ఉన్న హెల్త్ సీక్రెట్స్‌..

Kavya Nekkanti
సాధారణంగా ధనియాలను సుగంధంకోసం వంటల్లో వాడుతుంటారు. ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఆనవాయితీ. అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు. ధనియాలలోని ఔషధ గుణాల గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. అయితే మధుమేహం, పేగుపూత, నోటిపూత, మూత్రవ్యాధులు అతిగా దప్పిక, అజీర్తి, నెమ్ము, జలుబు, జ్వరం, శోష, అలర్జీ ఈ వ్యాధులన్నింటి నివార‌ణ‌కు ధ‌నియాలు కీల‌క పాత్ర పోషిస్తాయి.


ధనియాల నుంచి తీసిన తైలం బ్యాక్టీరియాను, వివిధ సూక్ష్మ‌క్రీముల లార్వాలను అంతమొందించినట్లు పరిశోధనల్లో తేలింది. ధనియాల రసాన్ని రోజూ ఉదయం, సాయంకాలం తాగితే మధుమేహ రోగులకు దాహం తగ్గుతుంది. ధనియాలను పేస్టులాగా మెత్తగా నూరి తలమీద పట్టు వేసుకుంటే తలనొప్పి, వేడి తగ్గుతాయి. ఎలర్జీ లక్షణాలపైన ధనియాలు బాగా ప‌ని చేస్తుంది. వివిధ రకాలైన రోగాలను తగ్గిస్తుంది కాబట్టి ఆయుర్వేదంలో ధనియాలను ఉప‌యోగిస్తారు.


ధనియం గుండె జబ్బులకు పథ్యం. అజీర్తిపైన దీని ప్రభావం వేరే వివరించనవసరం లేదు. ధ‌నియాల చారుకున్న శక్తిని అంత తేలికగా కొట్టివేయడానికి వీల్లేదు. దగ్గు, జలుబు, ఆయాసం విరేచనాలలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.  ధనియాల పొడి కొలెస్టరాల్‌ని అదుపులో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌చి ఫ‌లితం ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: