రోజు ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు వాడుతున్నారా... ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి

Kavya Nekkanti
స‌హ‌జంగా చాలా మంది ప్ర‌తిరోజు ప‌చ్చి మిర‌ప‌కాయ‌లను వంట‌ల్లో వ‌డుతుంటాం. కొంద‌రు కారానికి బ‌దులుగా ప‌చ్చి మిర్చినే ఎక్కువ‌గా వాడుతుంటారు. కారం కంటే కూడా ప‌చ్చిమిర్చితో చేసిన వంట‌లే బాగుంటాయి. అలాగే ఎండుమిర్చి కంటే ప‌చ్చిమిర్చి వాడ‌డం వ‌ల్ల చాలా ఉప‌యోగాలు ఉన్నాయి. నిజానికి ప‌చ్చిమిర్చిలో కేల‌రీలు ఏం ఉండ‌వు.. కానీ అంత‌కు మించిన అద్భుతం వీటిలో ఉన్నాయి. 


ఇవి తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను వేగ‌వంతంగా ప‌నిచేస్తాయి. అలాగే ప‌చ్చిమిర్చిలో ఐర‌న్ అధిక స్థాయిలో ఉంటుంది. ఎవ‌రైనా ఐర‌న్ లోపం ఉన్న‌వారు వీరి ఆహ‌రంలో వీటిని వాడాలి. మ‌రియు ప‌చ్చిమిర్చి మాన‌వ శ‌రీరానికి ఎన్నో ఉప‌యోగాలు చేస్తాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో మ‌రి ఇప్పుడు చూద్దాం..


- ప‌చ్చిమిర్చి మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్థులకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ చేయ‌డానికి ఇవి స‌హ‌క‌రిస్తాయి.


- బ‌రువు త‌గ్గాల‌నుకునే వాళ్ల‌కు ప‌చ్చిమిర్చి వాడ‌డం వ‌ల్ల దానిలో ఉండే క్యాప్సెయిసిన్ శరీర మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేసి అధిక కొవ్వుని కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.


- ప‌చ్చి మిర్చిలో ఉండే  విటమిన్ బి6, ఐరన్, విటమిన్ ఎ, పొటాషియం, కాపర్, నియాసిన్, ఫోలేట్, ఫైబర్ వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన పోష‌ణ గుణాలు అందుతాయి. 


- విటమిన్ సి ప‌చ్చిమిర్చిలో పుష్కలంగా ఉంటుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి పెంచుతుంది.


- ప‌చ్చి మిర్చిలో ఫైటోస్టెరాల్ అనే పదార్ధం ద్వారా  రక్తనాళాల్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను నివారించి గుండె జబ్బులు రాకుండా స‌హాయ‌ప‌డుతుంది.


- ప‌చ్చి మిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి, క్యాన్సర్ కణాలను నివారంచ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.


- అలాగే ప‌చ్చి మిర్చిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాల వ‌ల్ల కంటి, చ‌ర్చ స‌మ‌స్య‌లు రాకుండా మ‌రియు య‌వ్వ‌నంగా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. 


అందుకే మ‌న నిత్య జీవితంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే మ‌రియు ఆరోగ్యాన్ని అందించే ప‌చ్చిమిర్చిని రోజు మ‌న ఆహారంలో వాడ‌డం చాలా మంచిద‌ని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: