ధ‌నియాలలో ఆశ్చ‌ర్య‌పోయే ర‌హ‌స్యాలు

Kavya Nekkanti
ధనియాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే వాటిని చాలా కొద్ది మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటారు. వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. 


న్యూట్రీషియన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8%, కాల్షియం 2.9%, ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ధనియాలు కూడా ఒక గొప్పపోషకాంశాలున్న ఆహారంగా వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.  ధనియాలకు సంబంధించిన ఆరోగ్య మ‌రియు సౌంద‌ర్య‌ ప్రయోజనాలు తెలిస్తే మీరూ వాటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తారు. 


- ధనియాలను ఏదో రకంగా రోజూ తీసుకుంటే మీకు షుగర్ అనేదే రాదు. టైఫాయిడ్‌ వచ్చినప్పుడు ధనియాలను తీసుకుండి. వెంటనే తగ్గిపోతుంది.


- ధనియాలతో తయారు చేసే కషాయం వల్ల చాలా లాభాలున్నాయి. వాటిని బాగా నీటిలో మరిగించి వడకట్టుకుని ఆ కషాయం తాగండి. దీనివల్ల వెంటనే జలుబు తగ్గిపోతుంది.


- ఫ్యాట్ కరిగించడానికి కూడా ధనియాలు బాగా ఉపయోగపడతాయి. ధనియాలను మెత్తగా పొడిలాగా చేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని దాన్ని నీటిలో కలుపుకుని తాగండి. అంతే బాడీలోని ఫ్యాట్ మొత్తం అట్టే కరిగిపోతుంది. 


- ధనియాల పొడి మరియు పసుపు లేదా ధనియాల రసంతో మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


- ధనియాల‌ను రోజూ తీసుకుంటే బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ధనియాల కషాయం తయారు చేసుకుని అందులో కాస్త పాలు, చక్కెర కలుపుకుని తాగండి. దీని వల్ల మీకు మంచి నిద్రపడుతుంది.


- కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: