పానీయాల కన్నా టమోటా రసం మేలు

Durga
శక్తినిచ్చే పానీయాల కన్నా టమోటా రసం చాలా మంచిదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది వ్యాయామం, శారీరకశ్రమ అనంతరం శరీరం తిరిగి శక్తిని పుంజుకోవటానికి తోడ్పడుతున్నట్లు బయటపడింది. రక్తనాళాలు సాధారణ స్థితిలోకి రావటానికి, కండరాలు కోలుకోవటానికి అవసరమైన కీలక రసాయనాలు టమోటా రసంలో దండిగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఇటీవల గ్రీసులోని జనరల్ కెమికల్ స్టేట్ ల్యాబోరేటరీ పరిశోదకులు రెండునెలల పాటు క్రీడాకారులపై ఒక అధ్యయనం చేశారు. వ్యాయామం చేయటానికి ముందూ తర్వాతా వారికి పరీక్షలు నిర్వహించారు. వ్యాయామం చేశాక కొందరికి టమోటా రసం ఇవ్వగా... మరి కొందరికి శక్తినిచ్చే పానీయాలను ఇచ్చి పరీశీలించారు. టమోటా రసం తాగినవారిలో కండరాలు చాలా త్వరగా కోలుకున్నాట్లు బయటపడింది. వీరిలో గ్లూకోజ్ స్థాయిలు కూడా వేగంగా సాధారణ స్థితికి చేరుకున్నట్లు వెల్లడైంది. కండరాలకు, మెదడుకు హాని చేసే ఎంజైమ్ లు, ప్రోటీన్లు అధిక మెత్తంలో ఉన్నవారికి టమోటా రసం ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: