డ్రై ఫ్రూట్స్ తో ఆరోగ్యానికి ఎంతో మేలు..!

Edari Rama Krishna
సాధారణంగా మనకు ఆహారంతో పాటు పండ్లు తినడం వల్ల ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఇక డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డ్రై ఫ్రూట్స్ ఎండబెట్టిన విధానం ద్వారా లేదా గాలి సొరంగంలో గాని ఎండబెట్టి తయారుచేస్తారు. తాజా పండ్లలో నీటిని తొలగించటం ద్వారా డ్రై ఫ్రూట్స్ ని తయారుచేస్తారు. తాజా పండ్లు నిర్జలీకరణము జరిగి అవసరమైన పోషకాలు కొన్ని ఎక్కువ గాఢముగా మారటం వలన పండు లుక్ కూడా మారుతుంది.డ్రై ఫ్రూట్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


అందమైన,ఆరోగ్యకరమైన చర్మం : రోగనిరోధక వ్యవస్థ బాగుంటే చర్మం తాజాగా మరియు నిగనిగలాడుతూ ఉంటుంది. పండ్లలో రాజైన మామిడి పండులో జుట్టు పెరుగుదలలో సహాయం చేయటానికి పిండి పదార్ధాలు సమృద్దిగా ఉంటాయి. అయితే డ్రై మామిడిలో ఫోటో న్యూ త్రియంత్స్, విటమిన్లు ఎ, సి మరియు E,ఒమేగా 3 మరియు 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మం మరియు రోగనిరోధక ఆరోగ్యానికి చాలా అవసరం.

ఎండుద్రాక్షలో ఉండే రెస్వెట్రాల్ అనే యంటి ఆక్సిడెంట్ చర్మ కాలవ్యవధిని తగ్గిస్తుంది. అక్రోట్స్ లో  లినోలెనిక్ ఆమ్లం ఉండుట వలన పొడి చర్మానికి పోషణ,నిర్మాణంలో సహాయం మరియు ముడతలను తగ్గించటంలో సహాయపడుతుంది.


జీర్ణశక్తి బాగుంటుంది : జీర్ణశక్తి, మలబద్ధకంలను నిరోదించటానికి ఫైబర్ సహాయపడుతుంది. చెర్రీ మరియు అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రోజువారీ ఆహారంలో చేర్చాలి. చెర్రీని   "యాంటిఆక్సిడెంట్ సూపర్ పండు" అని అంటారు. ఈ పండులో యాంటిఆక్సిడెంట్ అధిక స్థాయిలోనూ, బీటాకెరోటిన్, ఫోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు అదనంగా ఉంటాయి. అంజీర్ లో ఇనుము, ఫోలిక్ ఆమ్లం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.


కీలకమైన పొటాషియం : తాజా ఆప్రికాట్లు మరియు రేగులో పొటాషియం సమృద్ధిగా ఉన్నప్పటికీ, పొడి ఆప్రికాట్లు మరియు ప్రూనేలో పొటాషియం చాలా అధిక మొత్తంలో ఉంటుంది. సోడియం + పొటాషియం కణాంతర మరియు వెలుపల నీటి మట్టాల సంతులనంను  నియంత్రిస్తాయి. పొటాషియం రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


శరీరంలో ఐరన్ కంటెంట్ ని పెంచుతుంది : డ్రై ప్రూనే మరియు ఆప్రికాట్లలో ఇనుము సమృద్దిగా ఉంటుంది.  ప్రూనే మరియు అప్రికాట్ లో ఉండే ఐరన్ రక్త హీనతను నివారించటంలో సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో కూడా పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం మరియు ఇనుము సమృద్దిగా ఉండి రక్త ప్రసరణను  ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: