దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి..!

Edari Rama Krishna
సాధారణంగా మనుషులకు వాతావరణ పరిస్థితులను బట్టి..తీసుకునే నీరు, ఆహారాన్ని బట్టి ఆహారంలో కొద్ది పాటి మార్పులు సంబవిస్తుంటాయి.  ఇక మనం తీసుకునే మంచినీటి విషయం ఏ మాత్రం తేడా వచ్చినా అది గొంతుపై ప్రభావం చూపిస్తుంది. దగ్గు రాడం, జలుబు కావడం లాంటివి జరుతుగుంది. దగ్గు వివిధ కారణాల వలన కూడా రావటానికి అవకాశం ఉంది, దుమ్ము వలన కలిగే అలర్జీ, కాలుష్యము మరియు పొగత్రాగటం, గొంతులో ఇన్ఫ్ల-మేషన్, అంతేకాకుండా ఉపిరితిత్తుల కాన్సర్, ఆస్తమా, సైనస్, ఫ్లూ, గుండె సంబంధిత వ్యాధులు మరియు వాతావరణంలో మార్పుల వలన కూడా దగ్గు రావచ్చు. ఇంట్లో ఉండే ఔషదాలు అల్లోపతి మందుల కన్నా శక్తి వంతంగా పని చేస్తాయని నిరూపించబడింది. ఈ ఔషదాలు దగ్గుని మాత్రమే కాకుండా దాన్ని కలుగచేసే కారకాలను కూడా తోలగిస్తాయి.


అల్లం-వెల్లుల్లి :  దగ్గుకి అల్లం మరియు వెల్లులి మంచి ఔషదాలు అని చాలా మంది వైద్యులు వెల్లడించారు. అల్లం-వెల్లుల్లితో తయారు చేసిన టీ గొంతుని తడిపి, మ్యూకస్'ను తోలగించి మరియు శ్వాసని సులభతరం చేస్తుంది.


బాదం గింజలు :   కొన్ని బాదం గింజలను తీసుకొని వాటిని మెత్తగా దంచండి. వీటికి తేనెని కలిపి చిక్కని పేస్ట్'లా తయారుచేయండి. దగ్గు నుండి విముక్తి కోసం ఈ మిశ్రమాన్ని రోజుకి మూడు సార్లు తీసుకోండి.

తేనే : తేనె అనగానే అది తీపి పదార్థం కదా అనే అనుమానం రావచ్చు కానీ.. 'పెన్న స్టేట్ యూనివర్సిటి' వాళ్ళు తెలిపిన దాని ప్రకారం తేనే కలిగి ఉండే యాంటీ-బాక్టీరియల్ గుణాలు, రోగకారక బ్యాక్టీరియాలను హోస్ట్ (పరాన్నజీవి) పద్దతి ద్వారా చంపి వేస్తాయి. తేనే యాంటీ-ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శ్వాస గొట్టాలకు కలిగిన గాయాలను త్వరగా మాన్పించేస్తుంది.

నల్ల మిరియాలు : ఇవి దగ్గుని త్వరగా తగ్గిస్తాయి, వీటిని దగ్గు నివారణ మందుల తయారీలలో కుడా వాడతారు. ఎండిన అల్లం మరియు నల్ల మిరియాలను సమాన పాళ్ళలో కలిపి, తేనేని కలుపుతూ పేస్టు'లా చేసి, రోజులో కొన్ని సార్లు వాడటం వలన దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

ట్యుమరిక్ పొడి : ఇది ఇంట్లో ఉండే ఔషదాలలో దగ్గుకి శక్తివంతంగా పని చేసే ఔషదం. రోజు ఒక గ్లాసు వేడి పాలలో కలుపుకొని, త్రాగటం చాలా మంచిది. ఇది చాతిలో గడ్డ కట్టిన పదార్థాలను మరియు శ్లేష్మాన్నితోలగించి, శ్వాస తీసుకోటాన్ని సులభతరం చేస్తుంది.
 
ద్రాక్ష పండ్లు :  ద్రాక్ష పండ్లతో చేసిన రసం కూడా దగ్గుని తగ్గించే శక్తివంతమైన ఔషదం. మీకు శ్వాస గొట్టాలు చిరాకుగా అనిపించినపుడు ద్రాక్ష పండ్ల రసంలో తేనెని కలిపి తీసుకోవటం మంచిది అని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. ఇది ఎక్స్పెక్టోరెంట్'గా పని చేసి గాలిని ఉపిరితిత్తులకు అందేలా చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: