ఆరోగ్యానికి దివ్యఔషదం అంజీరా..!

Edari Rama Krishna
ఈ మద్య కాలంలో మనిషి ఆరోగ్యం గురించి ఎన్నో రకాల జాగ్రత్తలు పడుతున్నారు. శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉండటానికి యోగా,జిమ్, వాకింగ్ లాంటివి చేస్తూన్నారు..అయితే వీటితో పాటు మనం తీసుకునే ఆరోగ్యం పట్లకూడా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా పండ్లు మంచి ఆరోగ్యాని ఔషదంలా పనిచేస్తాయి. ఇందులో కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ, కొన్ని పండ్లలో తాజాగా కన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయి.

అంజూరంను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆశక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటె విశాలంగా పెరుగుతుంది. పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇటీ వలి ‘జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ కాలెజ్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌’లో ఎండు పండ్లలో అత్యధికంగా పోషకాలు ఉన్నది అంజీరలోనేనని స్పష్టం చేశారు.


అంజీరా పండ్లల్లో 65 కేలరీలు ఉంటే, ప్రతి మూడు ఎండు పండ్లల్లో 215 కేలరీలు ఉన్నట్లు తేలింది. అంజీర పండ్లను విడిగానే కాకుండా ఇతర పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 


ఆరోగ్యానికి అంజీర ఫలము : కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్‌ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి.   అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.


పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి.  కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది.  అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: