ఆయుర్వేధంలో కర్పూర తైలం ఫార్ములా

Durga
 వాముని పైపైన దంచి దానికి నాలుగు రెట్లు నీళ్ళుపోసి ఒకవంతు నీరు మిగిలేగా బాగా మరిగించండి. అలా మరిగిన వాముకషాయాన్ని, గుడ్డలోవేసి వడబోయండి. ఈ కషాయం ఒకటిన్నర లీటర్లు(1.5 లీటర్లు) తీసుకోండి. ఈ కషాయంలో నాలుగువందల గ్రాములు కొబ్బరినూనె కలిపి మళ్ళీ మరిగించండి. నీరంతా ఆవిరి అయిపోయి కేవలం నూనెమాత్రమే మిగిలేలా మరగాలి. మంట మీద ఒకటి రెండు చుక్కలు వేస్తే చిటపట మనకుండా మండిపోతే నీరులేకుండా నూనె మాత్రమే మిగిలినట్లు... ఇలా మిగిలిన నూనెని వేడిమీదే వడగట్టండి. వడబోసిన నూనెలో 100గ్రాములు ముద్దకర్ఫూరం (మంచి హారతి కర్పూరం) ఆ వేడి మీదే కలిపేయండి. మొత్తం కరిగిపోతుంది. బాగా చల్లారిన తర్వాత సీసాలో పోసి మూతపెట్టేయండి. ఇదే కర్పూర తైలం అంటే ! 1. అన్ని రకాల కీళ్లనొప్పులు, కీళ్ళవాపుల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పైన మర్ధన చేయడమే. 2. దగ్గు, జలుబు, పడిశెభారములలో రొమ్ము ఉదరభాగం, వీపు, ముక్కుల మీద మర్ధన చేస్తే తక్షణ ఉపశమనం ఉంటుంది. Congestion తగ్గుతుంది. 3.శ్లేష్మ జ్వరాలలో కూడా ఇదే విధంగా శరీరంపైన మర్ధన చేస్తే జ్వరం ఉపశమనం ఇస్తుంది 4. అరికాళ్ళు, అరిచేతులు మంటలు పుడుతున్నపుడు కర్పూర తైలం రాస్తే ఉపశమనం. 5.తలనొప్పి, సైనసైటిస్, మైగ్రేయిన్ తలనొప్పుల్లో ముక్కుల్లో చుక్కల మందుగా దీన్ని వాడితే నొప్పి ఉపశమిస్తుంది 6.కర్పూర తైలం 2,3 చుక్కలు ముక్కుల్లో వేసుకుంటే పడిశబారం వలన ముక్కు దిబ్బడ తగ్గుతుంది. వయసులో పెద్దవారు, చిన్నపిల్లలూ ఇంట్లో వుంటే, ఆ ఇంట్లో తప్పనిసరిగా కర్పూర తైలం వుంచుకోవాల్సిన అవసరం వుంది. అందుకే ఉత్సాహం వున్నవారు స్వంతగా చేసుకోవడం కోసం ఈ ఫార్ములాను తెలియజేస్తున్నారు వైధ్యనిపుణులు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: