మెనోపాజ్ మహిళలు పాటించాల్సిన నియమాలు !

Durga
మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరఫీ తీసుకుంటూ పరిస్థితిని మరింత మెరుగుపరిచే కొన్ని నియమాలు పాటించాలి. ఓంట్లో వేడి ఆవిర్లు తగ్గించడం కోసం : పగటికంటే రాత్రివేళల్లో ఒంట్లో వేడి పుట్టడం అధికంగా ఉంటుంది. ఈ విధమైన శారీరక అసౌకర్యాన్ని కొంతవరకూ కంట్రోల్ చేయడం కోసం కొన్ని నియమాలు పాటించాలి. 1.పలుచని దుస్తులు ధరించాలి. 2. వీలైనన్ని ఎక్కవ నీళ్లు త్రాగాలి. 3, వేడి పధార్థాలైన సూప్స్, మసాలా, కారం పధార్థాలు, కెఫీన్ అధికంగా ఉండే కాఫీలు, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. 4. నెమ్మదిగా పీల్చి వదిలే బ్రీతింగ్ వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఒంట్లో వేడి ఆవిరి మొదలయ్యే అనుమానం కలిగినపుడు ఇలాంటి వ్యాయామం ఆ లక్షణాన్ని ఆదిలేనే ఆపేస్తుంది. నిద్రలేమి : స్త్రీలను బాధించే మరో లక్షణం నిద్రలేమి. ఈ అసౌకర్యాన్ని నివారించడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయి.. 1. నిద్రకు ఉపక్రమించే సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా పాటించాలి. క్రమం తప్పకుండా ఆ సమయానికే నిద్రపోయే ప్రయత్నం చేయాలి. 2. నిద్రకుఉపక్రమించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకోవాలి. పొరపాటున కూడా ఇక ఏ మెతక పధార్థాలు తీసుకోకూడదు. 3. ఆల్కాహాల్ తీసుకోవడం, సిగరేట్ త్రాగడం లాంటి అలవాట్లు పూర్తిగా నిషిద్ధం 4.పడుకుని టీవీ చూడడం మానేయాలి. 5.రిలాక్సేషన్ టెక్నిక్ అయిన డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. వెజైనల్ డ్రైనెస్ నివారణ : మెనోపాజ్ మహిళలు బయటకు చెప్పకోలేని మరో అసౌకర్యం వెజైనల్ డ్రైనెస్(యోని పొడిబారడం) సంసారసుఖాన్ని దుర్భరం చేసే ఈ సౌకర్యం కారణంగా, సంసారంలో బార్యాభర్తల మద్య కలతలు తలెత్తే ప్రమాదం కూడా వుంది. ఈ అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికి కూడా కొన్ని పద్దతులున్నాయి. 1.వెజైనల్ క్రీమ్స్ లేదా జెల్స్ ఉపయోగించాలి. 2. శరీరం డీ హైడ్రేడ్ అవ్వకుండా ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. 3.మాయిశ్చరైజర్ లోషన్స్ వాడాలి. 4 కండరాల పటుత్తం పెంచడం కోసం ఎక్సర్ సైజ్ చేయాలి 5.యూరిన్ లీకేజ్ అవ్వకుండా యూరినరీ బ్లాడర్, యురేత్రాలను పట్టి వుంచే ఫెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కు బలం చేకూరే ఎక్స్ర్ సైజులు చేయాలి. ఇలాంటి ఎక్సరసైజ్లు వెజైనల్ కెనాల్ కు పటుత్వాన్ని పెంచి, యూరిన్ ఫ్లోను నియంత్రిచండంతో పాటు ఆర్గాజమ్ అనుభూతిని రెట్టింపుచేస్తుంది. యూరిన్ పాస్ చేయడం కోసం ఉపయోగపడే కండరాలను బిగపట్టడం వదులు చేయడమే ఈ ఎక్సర్ సైజులో చేయవలసిన పని.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: